రోడ్డు మీద పడి ఉన్న నిమ్మకాలయను చూడగానే.. చాలామందికి భయమేస్తుంది. వాటిని తొక్కకుండా పక్కనుంచి వెళిపోతుంటారు. వాటిని ఏవో చేతబడులు చేయడానికో లేదా ఏదైనా దిష్టి తీయడానికి ఉపయోగించారోమోనని అనుమానపడుతూ ఉంటారు. కానీ నిమ్మకాయలతో మంత్ర ప్రయోగాలు చేయడమే కాదు.. నిమ్మకాయల్లో మన ఆరోగ్యాన్ని మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
సహజసిద్ధమైన నిమ్మకాయలతో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుని పాటిస్తే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ముఖ్యంగా ఎండాకాలంలో నిమ్మకాయలతో చాలా అవసరం ఉంటుంది. వడదెబ్బ నుంచి బయటపడేందుకు చాలామంది నిమ్మరసం తాగుతూ ఉంటారు. అదే కాదు, నిమ్మకాయలతో చాలా చేసుకోవచ్చు. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
వేడి నీళ్లల్లో ఒక నిమ్మకాయని పిండి తాగాలి. ఇలా చేస్తే మన శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు లభిస్తాయి. ఇక ఇలా చేస్తే రక్త సరఫరా మెరుగవడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు రావు. అలాగే శరీరంలోని కొవ్వును కలిగిస్తుంది. ఇక షుగర్ పేషెంట్స్ రోజూ వేడి నీళ్లల్లో నిమ్మకాయ పిండుకుని తాగడం వల్ల షుగర్ శాతం అదుపులోకి వస్తుంది.
ఇక శరీరంలోని విష వాయువులు, మలినాలు , వ్యర్థాలు బయటికి వస్తాయి. ఇక కిడ్నీలోని రాళ్లు కలిగిపోతాయి. ఇక కడుపునొప్పిగా ఉన్నప్పుడు గ్లాస్ నిమ్మరసం తాగితే ఉపశమనం లభిస్తుంది.. గ్యాస్, ఏసీడీటీ, మలబద్దకం లాంటి సమస్యలు దరిచేరవు.
Share your comments