వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రభలమవ్వడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ఈ సమయంలో అంటు వ్యాధులు రాకుండా ఎన్నో జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఈ వర్షాకాలంలో లెమన్ గ్రాస్ తో చేసిన టీ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మగడ్డిలో యాంటీ ఇంఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ టీ ప్రతిరోజు తాగడం వలన జీర్ణవ్యవస్థ మెరుగుపడడటంతోపాటు, జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అయితే లెమన్ గ్రాస్ తో చేసిన టీ తాగడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అలాగే, దీనిని ఎలా తయారుచేసుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనం తీసుకునే ఆహారం మరియు పర్యావరణ కాలుష్యం మూలంగా మన శరీరంలో ఎన్నో మలినాలు పేరుకుపోతాయి, వీటిని టాక్సిన్స్ అని పిలుస్తారు. ప్రతిరోజు ఉదయం లెమన్ గ్రాస్ టీ తాగడం వలన శరీరం డేటాక్సిఫై అవుతుంది. దీనివలన అనేక రకాల రోగాలు మన దరిచేరకుండా ఉంటాయి. ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా లెమన్ గ్రాస్ టీ తాగడం వలన ఒత్తిడి దూరమవుతుంది. నిమ్మగడ్డితో పాటు అల్లం, యాలకలు, లవంగం మరియు కొంచెం నిమ్మరసం కూడా కలుపుకుంటే, టీ రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది.
లెమన్ గ్రాస్ ఎన్నో పోషకాలకు మూలం. దీనిని ప్రతి రోజు టీ రూపంలో తీసుకోవడం ద్వారా జింక్, ఐరన్, ఫోలేట్ మరియు విటమిన్-ఏ, సి వంటి ముఖ్యమైన పోషకాలు ఎన్నో లభిస్తాయి. ఉదయాన్నే లెమన్ గ్రస్స్ టీ తాగడం వలన రోగనిరోధక శక్తీ వృద్ధి చెందుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న లెమన్ గ్రాస్ టీ తయారుచెయ్యడం కూడా చాలా సులభం. దీనికోసం ఒక కప్పు నిమ్మ గడ్డి, రెండు యాలకలు, రెండు లవంగాలు, మరియు ఒక చెంచా తేనె ఉంటె సరిపోతుంది.
లెమన్ గ్రాస్ టీ చెయ్యడానికి, ఒక పాన్ లో నీరు పోసి, నీళ్లు వేడెక్కాక దానిలో పైన చెప్పిన అన్ని పదార్ధాలు వేసి బాగా మరిగించాలి. నీళ్లు రంగు మరీనా తరువాత, ఆ నీటిని వడగట్టి, దీనిలో కొంచెం నిమ్మరసం మరియు ఒక చెంచా తేనే కలుపుకొని తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనిని ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.
Share your comments