కమలా పండును చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరు చాల ఇష్టంగా తింటారు.మనం సాధారణంగా కమలా పండుని తిని తొక్కలను బయట పారేస్తాం. కమలా పండు మన ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడితే, కమలా తొక్కలు మన చర్మాన్ని రక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. నారింజ తొక్కలలో చర్మాన్ని కాంతివంతంగా మార్చదడానికి సహాయపడే విటమిన్ సీ చాల పుష్కలంగా కలిగిఉంటాయి. ఇవి ముఖంలో వృధాప్య ఛాయలను తగ్గించడంలో సహాయపడుతుంది.
నారింజ తొక్కలతో మొటిమల సమస్యలకు కూడా పరిష్కరించే విధంగా యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలను కలిగి ఉంటాయి. నారింజ తొక్కల్లో వివిధ మినరల్స్ అయినా మెగ్నీషియం, కాల్షియమ్, పొటాషియం మన చర్మాన్ని మృదువుగా ఉంచటానికి తోడ్పడతాయి.
నారింజ తొక్కలో ఉండే ఫ్లేవినాయిడ్స్ చర్మాన్ని తాజాగా ఉంచి, మంటను తగ్గిస్తాయి. మన ముఖంపై ఉండే మచ్చలను, బ్లాక్ హెడ్స్ ను నారింజ తొక్కలతో పోగొట్టవచ్చు. ముఖంపై మృతకణాలను మరియు బ్లాక్ హెడ్స్ ను సులువుగా తొలగించి, చర్మకాంతిని పెంచడానికి ఈ కమల తొక్కల పొడి సహాయపడుతుంది. నారింజ తొక్కలో సిట్రిక్ ఆసిడ్ ఉన్నందున డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, మొటిమల మచ్చల సమస్యలను తేలికగా నయం చేస్తుంది.
ఇది కూడా చదవండి..
ప్రతిరోజూ కొన్ని వాల్నట్లను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు !
నారింజ తొక్కల పొడిలో ఉండే కాల్షియమ్ చర్మాన్ని పునరుద్ధరణ చేసి, చర్మంలో ఉన్న అదనపు నూనెను తొలగిస్తుంది. యూవీ కిరణాల నుండి మన చర్మాన్ని కాపాడే యాంటీ యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు ఈ నారింజ తొక్కల పొడిలో ఉంటాయి. అంతేకాకుండా ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుచి, వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తాయి. నారింజ తొక్కలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలతో మొటిమల సమస్యలను తాగించుకోవచ్చు.
కమలా తొక్కలను ఎండలో ఆరబెట్టి పొడి చేసుకుని ఒక మెత్తని వస్త్రంలో జల్లించుకోవాలి. ఈవిధంగా తయారుచేసుకున్న పొడి నాలుగు లేదా ఐదు నెలల వారికి నిల్వ చేస్కోవచ్చు. దీనిని మీ యొక్క బ్యూటీ కేర్ లో వాడుకోవచ్చు. ఈ తొక్కల పొడిలో పసుపు, తేనే కలిపి పేస్టులా చేస్కుని ముఖం శుభ్రపరుచుకున్న తరువాత పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిన తరువాత చల్లటి నీటితో 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల చర్మంపై ట్యాన్ తొలజి చర్మం తాజాగా ఉంటుంది.
ఇది కూడా చదవండి..
Share your comments