Health & Lifestyle

విటమిన్-డి లోపం వలన తలెత్తే అనారోగ్య సమస్యలు

KJ Staff
KJ Staff

శరీరం ధృడంగా మరియు ఆరోగ్యవంతంగా ఉండేదుకు రోజువారీ ఆహారంలో విటమిన్స్ చేర్చుకోవడం అవసరం. శరీరంలో విటమిన్స్ లోపిస్తే అనేక వ్యాధులు తలెత్తుతాయి. వాటిలో ముఖ్యమైనది విటమిన్-డి లోపం. విటమిన్-డి లోపం ద్వారా, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, జాయింట్ పెయిన్ మరియు అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఆహార అలవాట్లు రోజురోజుకి మారడం, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, మరియు సూర్యరశ్మి అందకపోవడం వీటన్నిటి ద్వారా శరీరంలో విటమిన్-డి లోపిస్తుంది. విటమిన్-డ్ లోపం, కొన్ని సందర్భాల్లో జుట్టు రాలిపోవడం, మానసిక సమస్యలు తలెత్తడం జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కండరాలు మరియు ఎముకలు బలహీనపడటానికి విటమిన్-డి లోపం ముఖ్య కారణం.

అయితే ఆహారంలో కొన్ని మార్పులు చేయ్యడం ద్వారా విటమిన్-డి లోపాన్ని అధిగమించవచ్చు. రాగి, బార్లీ, ఓట్స్ మరియు గోధుమల్లో విటమిన్-డి పుష్కలంగా లభిస్తుంది. పాల ఉత్పత్తులు, మరియు కోడిగుడ్ల సోనలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్-డి లోపాన్ని అధిగమించవచ్చు.

శరీర ధృడత్వానికి ఎంతో అవసరం ఉన్న విటమిన్-డి అధిక మొత్తంలో తీసుకుంటే శరీరానికి హాని కలిగిస్తుంది. విటమిన్-డి అధికంగా తీసుకోవడం ద్వారా రక్తంలో కాల్షియమ్ శాతం పెరిగి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అధిక విటమిన్-డి ద్వారా గుండె మరియు మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది.

Share your comments

Subscribe Magazine