Health & Lifestyle

మాములు నడకతో పోలిస్తే '8' ఆకారంలో నడిస్తే లాభాలు ఎక్కువ...

KJ Staff
KJ Staff

వాకింగ్ శరీరానికి చాలా అవసరం. ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాలు నడవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి, అయితే ఈ నడకలో కూడా కొన్ని పద్దతుల ద్వారా రేటింపు లాభాలను పొందవచ్చు. నడిచేటప్పుడు 8 ఆకారం వచ్చే విధంగా నడిస్తే దీని వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు. ఈ 8 అంకెను తిరగేసి చూస్తే ఇన్ఫినిటీ చిహానాన్ని చూపిస్తుంది. ఇన్ఫినిటీ అంటే అంతమైనది అని అర్ధం. అంటే 8 ఆకారం వచ్చేలా నడిస్తే కలిగే ప్రయోజనాలు కూడా అన్నే ఉంటాయి, కాబట్టే దీనిని ఇన్ఫినిటీ వాక్ అని కూడా అంటారు.

ఇలా 8 ఆకారంలో నడిచేటప్పుడు శారీరిక వ్యాయామంతో పాటు మానశిక ఏకాగ్రత మరియు ప్రశాంతత లభిస్తాయి. అయితే ఈ విధంగా నడవడానికి ఒక కాళీ ప్రదేశంలో ఉహకరమైన 8 చిహ్నాన్ని ఉహించుకొని దానిగుండా నడవాలి. ఎనిమిదికి ఉన్న మరొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఎన్నో మలుపులు ఉంటాయి. ఈ విధంగా నడిచేటప్పుడు ఆలోచనలకు మరియు శరీర కదలికలకు మధ్య సమన్వ్యయం ఏర్పడి, ఆలోచలన మీద స్థిరత్వం మరియు అదే సమయంలో ఏకాగ్రత శక్తీ పెరుగుతాయి. నడకలో ఇది ఒక చిన్నపాటి వ్యాయామంలా పనిచేసి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుంది.

బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది:

రక్త నాళాలు కుంచించుకుపోయి రక్త ప్రవాహంలో అవాంతరం ఏర్పడటం వలన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. 2018 లో ప్రచురించిన జర్నల్ ఆఫ్ ఫిసికల్ ఎడ్యుకేషన్ లో, 8 ఆకారంలో నడవడం వలన బీపీ తగ్గుతుందని ప్రచురించారు. ఈ ఆకారంలో నడవడం వలన గుండె మీద ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

ఒత్తిడి తగ్గుతుంది:

ఈ పురుగుల ప్రపంచంలో పని భారం పెరిగిపోవడం వలన ప్రతి ఒక్కరిలోనూ ఒత్తిడి ఎక్కువుగా ఉంటుంది. ఇలాంటి వారు ప్రతిరోజు ఇలా ఎనిమిది ఆకారంలో కొంచెం సేపు నడిస్తే, నడిచే ఆకారం మీద ద్రుష్టి పెట్టడం వలన మెదడు చురుకుగా పనిచేయడంతో పాటు మానశిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

కండరాల పనితీరు:

ఎనిమిది అనే ఆకారంలో చాలా మలుపులు ఉంటాయి, ఈ విధంగా నడవడం వలన కండరాలపై ఒత్తిడి పడి వాటి పనితీరు పెరుగుతుంది. ఈ విధంగా నడవటం వలన వీపు మరియు కండరాల మీద కూడా ఒత్తిడి పది వాటి పనితీరు పెరుగుతుంది. వంకరగా ఉండే మలుపుల దగ్గర కాళ్లను తిప్పుతూ ఉండాలి, ఇటువంటి సమయంలో కండరాలు ఎక్కువుగా పనిచేస్తాయి.

8 ఆకారంలో ఎవరు నడవకూడదు:

ఈ 8 ఆకారంలో నడవటం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, వాటిని పక్కన పెడితే కొంతమంది మాత్రం ఈ విధంగా నడవకూడదని వైద్యుల సూచన. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు మరియు కీళ్లు పట్టు లేనివారు ఈ విధంగా నడవకూడదు, అలాగే బాలింతలు కూడా ఈ విధంగా నడవడానికి లేదు ఎందుకంటే మలుపులు ఎక్కువుగా ఉండటం వలన కళ్ళు తిరగడం మరియు వాంతులు అవ్వడం జరగొచ్చు, కాబట్టి ఈ విధంగా నడవాలి అనుకున్నవారు వైద్యులని సంప్రదించిన తరువాతే ఈ పద్దతిని పాటించాలి.

Share your comments

Subscribe Magazine