పాల పదర్ధమైన పెరుగును ప్రోబయోటిక్ గా పరిగణిస్తారు. పెరుగును తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో కొన్ని రకాల బాక్టీరియా పొట్ట ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో తోడ్పడుతుంది. ముఖ్యంగా పెరుగన్నం తినడం ద్వారా శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది, కాబట్టి వేసవి కాలంలో పెరుగుతో చేసిన పదార్ధాలు తినమని చెబుతారు. పెరుగన్నం తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ మరియు కాల్షియమ్ సంవృద్ధిగా లభిస్తాయి. పెరుగన్నం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు పోషకాల ఘని:
పెరుగులో ఎన్నో రకాల ఖనిజాలు, విటమిన్లు సంవృద్ధిగా ఉంటాయి. పెరుగు తినడం ద్వారా విటమిన్-బి2, బి5, బి12, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియమ్, మెగ్నీషియం, మరియు ప్రోటీన్ ఎక్కువుగా ఉంటాయి. పొటాషియం బ్లడ్ ప్రెషర్ నియంత్రించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నపుడు పెరుగు తినడం ద్వారా ఒత్తిడి దూరమవుతుంది. పెరుగులోని కాల్షియమ్ దంతాలు మరియు ఎముకుల బలానికి తోడ్పడుతుంది.
పెరుగన్నం తినడం ద్వారా పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొట్టలోని జీవక్రియలను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. వాంతులు విరోచనాలు అయిన సమయంలో పెరుగన్నం తినమని చెబుతున్నారు, ఎందుకంటే ఇటువంటి సమయంలో శరీరం ద్రవాలను కోల్పోవడం మూలాన డిహైడ్రాషన్ కు గురవుతుంది, ఇటువంటి సమయంలో పెరుగన్నం తినడం ద్వారా శరీరం రిహైడ్రేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలామందికి రాత్రిపూట పెరుగన్నం తినొచ్చా? లేదా? అన్న సందేహం వస్తుంది.దీనికి సమాధానంగా రాత్రి పూట పెరుగన్నం తినకపోవడమే మంచిది అని చెప్పవచ్చు.
రాత్రిపూట పెరుగన్నం తినకపోవడమే మంచిది. ఎందుకంటే పగటిపూటతో పోలిస్తే రాత్రిపుట జీర్ణక్రియ తక్కువుగా ఉంటుంది. ఇటువంటి సమయలో పెరుగన్నం తింటే అరగడం కష్టంగా ఉంటుంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగన్నం తినకపోవడం మంచిది, వీరిలో జీర్ణక్రియ తక్కువగా ఉన్నవారు, దగ్గు, మరియు ఊబకాయంతో బాధపడేవారు, ఇంఫ్లమేషన్ ఉన్నవారు , రాత్రిపూట పెరుగన్నం తినకపోవడం మంచిది. రాత్రిపూట జీర్ణక్రియ తక్కువగా ఉంటుంది, దీనితో రాత్రి పెరుగన్నం తింటే, బరువు పెరగడం, మధుమేహం రావడం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
Share your comments