భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో నల్లమిరియాలు ఒకటి . నల్ల మిరియాలు కేవలం వంటలకు సరైన రుచి, వాసనను అందించడం మాత్రమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. చూడటానికి చిన్నవిగా ఉండే మిరియాలలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి.ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న నల్లమిరియాలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...
నల్లమిరియాలలో అధిక భాగం విటమిన్-సి ఉండటం వల్ల మన శరీరానికి కావాల్సినంత రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మన శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండడంతో వివిధ రకాలైన బ్యాక్టీరియా, వైరస్ ల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టడానికి దోహదపడుతుంది.
నల్ల మిరియాలలో అధికభాగం యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల ఏదైనా గాయాలను తొందరగా మాన్పించడంలోనూ, నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలోనూ, వాపును తగ్గించటంలోనూ సహాయపడుతుంది. అధిక శరీర బరువుతో బాధపడేవారు శరీర బరువును తగ్గించుకోవడం కోసం ప్రతిరోజు నల్ల మిరియాలతో తయారు చేసిన టీని తాగడం వల్ల శరీర బరువును క్రమంగా తగ్గవచ్చు. ఒక గ్లాసు నీటిలోకి ఐదు నల్ల మిరియాలు, చిన్న అల్లం ముక్కవేసి బాగా ఉడికించి ఇందులోకి టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గడమే కాకుండా, శరీర బరువును నియంత్రిస్తూ పేగు కదలికలకు దోహదపడుతుంది.
ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులతో బాధపడేవారికి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందడానికి నల్లమిరియాల టీ ఎంతగానో దోహదపడుతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రతిరోజు నల్ల మిరియాలను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల పై తెలిపిన ఆరోగ్యప్రయోజనాలు అన్నింటిని పొందవచ్చు.
Share your comments