ప్రస్తుతం మార్కెట్లో మనకు ఎక్కడికి వెళ్లిన డ్రాగన్ ఫ్రూట్స్ ఎంతో విరివిగా లభిస్తున్నాయి.ఈ డ్రాగన్ ఫ్రూట్ లో పోషకాలు అధికంగా ఉండటం వల్ల మార్కెట్లో దీని ధరకూడా అధికంగా ఉంటుంది.డ్రాగన్ ఫ్రూట్ లో అధిక పోషక విలువలు ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ డ్రాగన్ ఫ్రూట్ లో కన్నా వెయ్యిరెట్లు పోషకాలు అధికంగా కలిగి ఉన్నటువంటి పండ్లలో బ్రహ్మజముడు ఒకటి.
నిలువెల్ల ముళ్ళు కలిగి ఉండే ఈ బ్రహ్మ జముడు ఒక ఎడారి మొక్క.నీటి ఎద్దడిని తట్టుకొని జీవించడమే కాకుండా ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి పండ్లను అందిస్తుంది. అందుకే వీటిని ఎడారి మొక్కలు అని కూడా అంటారు. ముఖ్యంగా రైతులు తమ పొలంలో వేసుకున్న పంటకు రక్షణగా పొలం చుట్టూ బ్రహ్మజముడు మొక్కలను పెంచుకుంటారు. ఎలాంటి క్రిమి నాశకాలు ఆశించని మొక్కగా బ్రహ్మజముడును చెప్పవచ్చు.
ఈ బ్రహ్మజెముడు నుంచి వచ్చే కాయలు చూడటానికి గులాబీ వర్ణంలో ఉంటాయి. అయితే వీటిలో పోషకాలు కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఈ బ్రహ్మజముడు పండ్లలో అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు,బీటాలైన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఎంతో పుష్కలంగా లభిస్తాయి.ఇందులో ఉన్నటువంటి పోషకాలు మన శరీరానికి అందడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి దోహదపడతాయి. అదే విధంగా కాలేయ వ్యాధులు క్యాన్సర్ నివారణకు కూడా ఈ బ్రహ్మ జెముడు ఎంతగానో దోహదపడుతుంది. ఈ పండ్లలో ఉన్నటువంటి క్యాల్షియం ఐరన్ పీచుపదార్థాలు మధుమేహం, స్థూలకాయం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను తగ్గించడానికి దోహదం చేస్తాయి. ఈ పండులో ఉండే గింజల ద్వారా నూనెను తయారు చేస్తారు. ఈ పండ్లను ఎక్కువగా ప్రూట్ బార్ , బ్రహ్మజెముడు పండ్ల స్క్వాష్ లను తయారు చేస్తారు.అదేవిధంగా హానికరం కాని హెర్బల్ ఆల్కహాల్ ను తయారు చేయడానికి కూడా ఈ పండ్లను ఉపయోగిస్తారు.
Share your comments