ప్రస్తుత కాలంలో చాలా మంది వారి ఆహారపు అలవాట్లలో మార్పులు కారణంగా అధిక శరీర బరువు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది వారి శరీర బరువును నియంత్రించుకోవడానికి వివిధ రకాల శరీర వ్యాయామాలను, కఠినమైన ఆహారపు నియమాలను పాటిస్తున్నారు. అయితే ఎలాంటి కష్టం లేకుండా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రాత్రి క్యాబేజీ సూప్ తాగితే ఎంతో సులభంగా శరీర బరువును తగ్గించుకోవచ్చు.
క్యాబేజీలో ఎన్నో రకాల విటమిన్లు, పోషక పదార్థాలకు నిలయం. ఇన్ని పోషక విలువలు కలిగిన క్యాబేజీ సూప్ తయారు చేసుకొని తాగడం వల్ల తొందరగా శరీర బరువు తగ్గవచ్చు. ఈ క్యాబేజ్ సూప్ ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.మరి ఈ క్యాబేజ్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఒక ఉల్లిపాయను ముక్కలుగా కత్తిరించి పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక టమోటో, ఒక పచ్చిమిర్చి, క్యాబేజీని తురిమి పెట్టుకోవాలి.తరువాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా ముక్కలను వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత తురిమిన క్యాబేజీ మూడు నాలుగు కప్పుల నీటిని వేయాలి. ఈ నీరు బాగా ఉడుకుతున్న సమయంలో కొద్దిగా మిరియాలు వేసుకోవాలి.
ఒక ఐదు నిమిషాల పాటు క్యాబేజీని ఉడికించిన తరువాత ఈ మిశ్రమాన్ని వడపోసుకొని వచ్చిన సూప్ లోకి కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజు రాత్రి భోజనానికి బదులుగా ఈ సూప్ తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్, కేలరీలు కరిగి తొందరగా సన్నబడతారు. కనుక అధిక బరువు ఉన్నవారు శరీర బరువును తగ్గించుకోవడానికి క్యాబేజీ ఒక చక్కటి పరిష్కారం అని చెప్పవచ్చు.
Share your comments