ప్రస్తుత కాలంలో రోజురోజుకు క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య అధికమవుతోంది.ఈక్రమంలోనే క్యాన్సర్ తో బాధపడే వారు పౌష్టిక ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల తొందరగా క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చని భావిస్తుంటారు.ఈ క్రమంలోనే అధిక ప్రోటీన్లు పోషక విలువలు కలిగినటువంటి వేరుశనగపప్పు ఎక్కువగా తీసుకుంటారు.అయితే క్యాన్సర్ తో బాధపడే వారు వేరుశనగపప్పును అధికంగా తీసుకోవడం వల్ల మరణానికి దగ్గర పడతారని నిపుణులు వెల్లడిస్తున్నారు.
తాజా పరిశోధనల ప్రకారం క్యాన్సర్ ఈ వ్యాధితో బాధపడే వారు వీలైనంత వరకు వేరుశనగపప్పు తక్కువ పరిమాణంలో తీసుకోవాలని సూచించారు. వేరుశెనగపప్పులో అధిక మొత్తంలో అగ్లుటినిన్ (PNA) అనే ప్రోటీన్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రోటీన్ మన శరీరంలో రెండు రకాల ప్రొటీన్లను విడుదల చేస్తుందని ఈ ప్రొటీన్లు శరీరం మొత్తం వ్యాపించి క్యాన్సర్ కి కారణం అవుతాయని నిపుణులు వెల్లడించారు.
ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో భాగంగా ఈ విషయాలను తెలియజేశారు.అగ్లుటినిన్ రక్తంలో కలిసి శరీరమంతా తిరగడంతో క్యాన్సర్ కణాలకు వ్యాపించి తిరిగి ఈ ప్రోటీన్ రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంది. తద్వారా క్యాన్సర్ కణాలు శరీరం మొత్తం వ్యాపించడానికి కారణమవుతుంది. ఈ క్రమంలోనే రోజుకు 250 గ్రాముల వేరుశెనగపప్పు తిన్నవారు వారికి తెలియకుండానే మరణం అంచుకు వెళ్తారని నిపుణులు తెలియజేశారు.
క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజూ కేవలం 25 నుంచి 28 గ్రాముల వేరుశనగ పప్పులు తినడం వల్ల ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదని ఈ సందర్భంగా వెల్లడించారు.శరీరానికి PNA ను జీర్ణం చేయడం కష్టం. ఈ ప్రోటీన్ ఒక వేరుశెనగలో దాని బరువులో 0.15 శాతం వరకు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేశారు.
Share your comments