వేడి వేడి కాఫీ రోజుకు రెండు లేదా మూడు కప్పులు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే కప్పు కాఫీ తాగడం వల్ల కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది.కాఫీ తాగిన వెంటనే మనకు అలసట తొలగి ఎంతో హుషారుగా అనిపిస్తుంది దానికి కారణం కాఫీలోని కెఫిన్ అనే ఆల్కలాయిడ్ పుష్కలంగా ఉంటుంది.కెఫిన్ మన నాడీవ్యవస్థను ఉత్తేజపరిచి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అందుకే రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని కొందరు వైద్యులు సూచిస్తున్నారు.
అయితే తాజా అధ్యయనం ప్రకారం రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగే వారికి కరోనా వైరస్ సోకే ప్రమాదం కాఫీ తాగని వారితో పోలిస్తే దాదాపు 10 శాతం తక్కువగా ఉందని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. అలాగే సాధారణంగా కరోనా వైరస్ సోకిన వారిలో వచ్చే ఇన్ఫెక్షన్ తీవ్రత కంటే ప్రతిరోజు కాఫీ తాగే వారిలో ఇన్ఫెక్షన్ రేటు చాలా తక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
ప్రతి రోజూ కాఫీ తాగడం వల్ల వృద్ధుల్లో వచ్చే
న్యూమోనియా వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంది.కాబట్టి ప్రతిరోజూ కాఫీ తాగే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.కాఫీ తాగడం వల్ల కరోనా వైరస్ ప్రమాద తీవ్రత తగ్గుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందే. అలాగని ప్రతిరోజు మోతాదుకు మించి కాఫీని తాగితే డయాబెటిస్,జీర్ణ సంబంధిత వ్యాధులు, ఊబకాయం, నిద్రలేమి సమస్యలు వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Share your comments