Health & Lifestyle

పెరుగుతున్న డెంగీ ఫీవర్ కేసులు.... డెంగీ రాకుండ పాటించవలసిన చర్యలు.....

KJ Staff
KJ Staff

వర్షాకాలం మొదలయ్యింది, ఈ సీసన్ ఎన్నో వ్యాధులకు కారణమవుతుంది. వర్షాకాలంలో వేగంగా వ్యాప్తి చెందే వ్యాధులు డెంగీ జ్వరం కూడా ఒకటి. వర్షాకాలంలో దోమల సంఖ్య పెరగడానికి అనువైన వాతావరణం ఉంటుంది. డెంగీ రావడానికి దోమలు ప్రధానకరణమైన. ఈ వ్యాధికి కారణమైన వైరస్ను ఈ దోమలు వ్యాపింపచేస్తాయి. కాబట్టి దోమలను నియంత్రించగలిగితే.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ మరియు తెలంగాణాలో ఈ వ్యాధి ప్రభలమవుతుంది. ఎంతో ప్రమాదకారియైన ఈ వ్యాధిని కొన్ని జగ్రత్తలు పాటించడం ద్వారా నియంత్రించవచ్చు. డెంగీ జ్వరం రాకుండా ఉండేందుకు చెయ్యవలసిన మరియు చెయ్యకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చెయ్యవలసిన పనులు:

వర్షాకాలంలో మురుగు నీరు ఎక్కువుగా నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి అక్కడ నీరు నిలవనియ్యకుండా చెయ్యాలి. కాలి టైర్లు, డ్రమ్ములు, బోదెలు, గుంటల్లో వర్షపు నీరు నిలుస్తుంది, ఆ నీటిలో దోమలు గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచుకుంటాయి. కాబట్టి ఇంటి చుట్టుపక్కల ఉండే కాలి డ్రమ్ములు, కుండీలు మరియు టైర్లలో నీటిని ఎప్పటికప్పుడు పారబొయ్యలి. డ్రైయిన్లు మరియు గుంటల్లో కిరోసిన్ పొయ్యడం వలన దోమల లార్వాలకు గాలి అందక చనిపోతాయి. ఇంటి పరిసరాలను ఎల్లపుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

 

ఉదయం మరియు సాయంత్రం వేళల్లో డోర్లు మరియు కిటికీలు మూసి ఉంచాలి, దీని వలన దోమలు ఇంట్లోకి చొరబడవు, వెంటిలేటర్లకు చిక్కులు అమర్చుకోవాలి. దోమల్ని దూరంగా ఉంచే మస్కిటో రేపెళ్లేంట్స్ ఉపయోగించవచ్చు. చిన్నపిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు, దోమలు కుట్టకుండా ఉండేందుకు పొడవైన స్లీవ్స్ ఉండే షర్ట్స్ మరియు కాళ్లను పూర్తిగా కవర్ చేసే ప్యాంటు వేసి పంపించాలి. దోమలు కుట్టకుండా ఉండేందుకు మార్కెట్లో ఎన్నో మస్కిటో రేపెళ్లేంట్ క్రీమ్స్ అందుబాటులో ఉన్నాయి, పిల్లలకు వీటిని అప్లై చెయ్యాలి.

డెంగీ వ్యాధి వచ్చిందనటానికి హై ఫీవర్, విపరీతమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, కొన్ని సందర్భాల్లో చర్మంపై దురద మరియు దద్దుర్లు రావడం ఈ వ్యాధి లక్షణాలు కావచ్చు, ఇటువంటి సమయంలో వెంటనే వైద్యాన్ని సంప్రదించి రోగ నిర్ధారణ పరీక్షలు చేపించుకోవాలి. వ్యాధి ఉందని తేలితే సూచించిన మందులన్నీ క్రమం తప్పకుండ వాడాలి. వ్యాధి నుండి కోలుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి. జ్వరం ఎక్కువుగా ఉండటం వలన శరీరం ఎక్కువుగా నీటిని కోల్పోతుంది, కాబట్టి ద్రవరూపంలో పానీయాలు తీసుకోవాలి. శరీరం కోల్పోయిన లవణాలు మరియు ఎలెక్ట్రోలైట్లు పొందడానికి ఓఆర్ఎస్ మరియు కొబ్బరి తాగాలి.

చెయ్యకూడని పనులు:

ఈ మధ్య స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువయ్యాక ప్రతి ఒక్కరు సొంతవైద్యానికి అలవాటు పడుతున్నారు. డెంగీ వంటి ప్రాంతకమైన వ్యాధులు వచ్చిన సమయంలో సొంత వైద్యం మంచిది కాదు. వైద్యున్ని సంప్రదించకుండా మందులు వాడకూడదు, ఎందుకంటే కొన్ని మందులు వ్యాధిని మరింత తీవ్రమయ్యేలా చేస్తాయి, కాబ్బటి వైద్యుని పర్యవేక్షణలోనే మందులు వాడాలి. దోమలు ఎక్కువుగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్ళకపోవడం మంచిది , ఒకవేళ వెళ్ళవలసిన పరిస్థితి వస్తే మస్కిటో రేపెళ్లేంటి క్రీమ్స్ ఉపయోగించాలి.

డెంగీ జ్వరం వచ్చిన వ్యక్తుల్లో ప్లేట్లెట్స్ సంఖ్య అమాంతం పడిపోతుంది. ప్లేటిలెట్స్ సంఖ్యా తగ్గిపోతే ఇన్ఫెక్షన్లు ఎక్కువవుతాయి. అంతేకాకుండా బ్లీడింగ్ వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు. కాబట్టి వైద్యున్ని సంప్రదించి ప్లేట్లెట్స్ పెరగడానికి అవసరమైన మందులు వాడాలి. డెంగీ వ్యాధి తగ్గిన తరువాత శరీరంలో శక్తీ క్షిణిస్తుంది, తిరిగి మల్లి కోలుకోవడానికి శరీరానికి తగినంత సమయం ఇవ్వాలి.

Related Topics

#Dengue #Fever #causes #Symptoms

Share your comments

Subscribe Magazine