ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలామందిని వెంటాడుతున్న సమస్యల్లో మధుమేహసమస్య ఒకటి. మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు క్రమంగా పెరుగుతుంది. ఇందుకు గల కారణం మన జీవన విధానంలో మార్పులు చోటు చేసుకోవడం, అలాగే జన్యుపరమైన మార్పుల కారణంగా చాలా మంది మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే మధుమేహంతో బాధపడేవారు పూర్తిగా చక్కెరను తీసుకోవడం మానేస్తున్నారు.ఈ క్రమంలోనే చక్కెరకు బదులుగా ప్రత్యామ్నాయంగా షుగర్ ఫ్రీ టాబ్లెట్లు ఉపయోగించడం, బెల్లం ఉపయోగించడం వంటివి జరుగుతోంది. అయితే మధుమేహులకు తెలియని విషయం ఏమిటంటే చక్కెరకు బదులుగా బెల్లం కాకుండా కోకోనట్ షుగర్ ని ఉపయోగించడం ఎంతో ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ కోకనట్ షుగర్ అంటే ఏమిటి దీని ఉపయోగాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా కోకోనట్ షుగర్ ను కొబ్బరి సాప్ నుంచి తయారు చేస్తారు. కోకోనట్ పామ్ సాప్ నుంచి దానిని ముక్కలుగా చేసి దాని నుండి లిక్విడ్స్ సాప్ ని తీసి దానినీ వేడి చేయడం ద్వారా అందులో ఉన్నటువంటి నీరు ఆవిరిగా మారి బ్రౌన్ కలర్ షుగర్ ఏర్పడుతుంది. దీనినే కోకోనట్ షుగర్ అని కూడా పిలుస్తారు.ఇది చూడటానికి చాలా చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ మధుమేహంతో బాధపడేవారు చక్కెరకు బదులుగా షుగర్ వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఎవరైతే మధుమేహంతో బాధ పడుతుంటారో అలాంటి వారు తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ఈ క్రమంలోనే మనం రోజువారి ఆహారంలో భాగంగా తీసుకునే సాధారణ చక్కెరలు 60 నుంచి 65 శాతం గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది అదే కోకోనట్ షుగర్ లో అయితే కేవలం 35 శాతం గ్లైసీమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల మధుమేహంతో బాధపడేవారికి కోకోనట్ షుగర్ ఎంతో ప్రయోజనకరం అని చెప్పవచ్చు.
Share your comments