Health & Lifestyle

పిల్లల్లో కనిపించే ఈ లక్షణాలు థైరాయిడ్ లక్షణాలు కావచ్చు....

KJ Staff
KJ Staff

ఇప్పటివరకు పెద్దవారికి మరియు వయసు పైబడినవారికి మాత్రమే వస్తాయనుకున్న దీర్ఘకాలిక వ్యాధులు ఇప్పుడు చిన్న పిల్లల్లోనూ వస్తున్నాయి, ఈ పరిస్థితి ఎంతో బాధాకరం. చిన్న పిల్లలో వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల్లో థైరాయిడ్ ఒకటి. పిల్లల్లో థైరాయిడ్ లక్షణాలు గుర్తించి దానికి తగ్గట్టు మేలైన వైద్యం అందించాలి. ఈ లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొంత మంది పిల్లల్లో థైరాయిడ్ సమస్య పుట్టుకతోనే వస్తుంది. జన్యుపరమైన లోపాలు మరియు ఆహారపరంగా కూడా థైరాయిడ్ వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. ఐయోడిన్ లోపం వల్ల మరియు కొన్ని ఆటో ఇమ్యూన్ లోపాల వల్ల, అంతేకాకుండా తల్లికడుపుతో ఉన్నపుడు సరైన ఆహారం తీసుకోకపోతే థైరాయిడ్ వ్యాధి రావచ్చు. థైరాయిడ్ ఉన్న పిల్లల్లో థైరాయిడ్ గ్రంధి దెబ్బతిని హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

చిన్న పిల్లల్లో థైరాయిడ్ ఉందని ఈ లక్షణాల ఆధారంగా నిర్ధారించవచ్చు. పిల్లలో శారీరిక మరియు మానశిక ఎదుగుదల లోపించడం, తొందరగా అలసిపోవడం, నీరసంగా కనిపించడం, ఎల్లపుడు అనారోగ్యసమస్యలతో బాధపడటం వంటివి థైరాయిడ్ వ్యాధి లక్షణాలుగా గమనించవచ్చు. పిల్లల చర్మం పొడిబారడం మరియు పెళుసుగా కనిపించడం, ఎముకలు, దంతాలు బలహీనపడటం, జుట్టు ఎక్కువుగా రాలడం మొదలైన ఈ వ్యాధి ఉన్నవారిలో గమనించే ముఖ్యమైన లక్షణాలు. అంతేకాకుండా, కడుపుకు సంబంధించిన సమస్యలు, వీటిలో మలబద్దకం, అజీర్ణం, ఊబకాయం, మొదలైనవి ముఖ్యమైనవి. థైరాయిడ్ ఉందని నిర్ధారించే లక్షణాల్లో, గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంధి పెరగడం, కళ్ళు ఉబ్బినట్టు కనిపించడం, మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వంటివి కొన్ని ముఖ్యమైన లక్షణాలు.

పైన చెప్పబడిని లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి, వ్యాధి నిర్ధారణకు తాగించిన పరీక్షలు చేయించాలి. ప్రస్తుతం ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత, ప్రతివ్యాధికి సొంత వైద్యం చేసుకునే వారు ఎక్కువైపోయారు, థైరాయిడ్ వ్యాధికి కూడా ఇలా సొంత వైద్యం చేసుకోవం చాల ప్రమాదకరం, కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స అందించాలి. హైపర్ థైరాయిడిజం ఉన్నపిల్లకు, వ్యాధి ఉదృతిని బట్టి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ లేదా మందుల ద్వారా వ్యాధిని నయం చేస్తారు. వైద్యంతో పాటు మంచి పౌష్టికాహారం మీద కూడా ద్రుష్టి సారించాలి. ఐయోడిన్ లోపం కూడా థైరాయిడ్ రావడానికి కారణం కావచ్చు కనుక ఐయోడిన్ ఉన్న ఉప్పును వాడాలి. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఈ వ్యాధిని నిర్ధారించడానికి టీ.ఎస్.హెచ్ పరీక్ష చేయించాలి. థైరాయిడ్ ఉన్న పిల్లలకి శారీరిక మరియు మానశిక ఎదుగుదల లోపిస్తుంది కనుక ముందుగానే వ్యాధిని గుర్తించి తగిన నివారణ చర్యలు పాటించాలి.

Share your comments

Subscribe Magazine