కరోనా వైరస్ దశలవారీగా ప్రజలపై విరుచుకుపడుతూ మారణహోమం సృష్టిస్తోంది.ప్రస్తుతం కరోనా వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా ఇలా కొత్త కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాల ప్రజలను వణికిస్తూ భయాందోళన కలిగిస్తోంది.ఈ ప్రమాదకర కరోనా వేరియంట్ల నుంచి ప్రజలు రక్షణ పొందడానికి,వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి
వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ఇప్పటికే పలు ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కొరత ఆందోళన కలిగిస్తోంది.
మనదేశంలో కూడా వ్యాక్సిన్ కొరత ఉంది. ఈ కారణంగానే మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న 6 నుంచి 8 వారాల్లో ఇవ్వాల్సిన రెండో డోసును 12 వారాల తర్వాత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.కరోనా వైరస్ రూపాంతరం చెందుతూ దశలవారీగా ప్రజల పై విరుచుకు పడుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లు పై 2019 కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకొని తయారుచేసిన ప్రస్తుత వ్యాక్సిన్ ఈ కొత్త వేరియంట్లు పైన సమర్థవంతంగా పని చేస్తుందా అనే అనుమానం చాలామందిలో కలుగుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం వైరస్ పరివర్తనం ఇలాగే కొనసాగితే ప్రస్తుత వ్యాక్సిన్లు కూడా పనిచేయకపోవచ్చనని అలాంటి ప్రమాదకర పరిస్థితి రాకముందే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలన్నీ తమ ప్రజలకు సరైన సమయానికి రెండు వ్యాక్సిన్ డోసులు వేయించుకోవడం ముఖ్యమని అలాగే కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తిని ఒక్క వ్యాక్సిన్ డోస్ అడ్డుకోవడం చాలా కష్టమని సూచిస్తోంది.
Share your comments