ప్రస్తుతం కరోనా మహమ్మారి వివిధ వేరియంట్లో రూపంలో ప్రపంచ దేశాలన్నింటికి నిద్ర లేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే మనదేశంలో మొదటి దశలో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ రెండవ దశలో మాత్రం తీవ్రస్థాయిలో కేసులు పెరిగి మరణాలు కూడా అధిక సంఖ్యలో నమోదయ్యాయి. అయితే ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్న నేపథ్యంలో మూడవదశ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
మూడవ దశ కరోనా అత్యధికంగా చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఈ మహమ్మారి గురించి కొందరిలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో తల్లులు ఎన్నో అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. తల్లికి కరోనా సోకితే బిడ్డ ఆ తల్లి పాలు తాగవచ్చా.. తాగితే ఎలాంటి ప్రమాదం సంభవించదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలోనే ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో ప్రసూతి, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ మంజు పూరి మాట్లాడుతూ... తల్లికి కరోనా సోకితే ఎలాంటి సంకోచం లేకుండా బిడ్డకు పాలు తాగించవచ్చని తెలిపారు. అయితే బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లి చేతులను శానిటైజర్ చేసుకోవాలి. అదేవిధంగా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ బిడ్డకు పాలివ్వవచ్చని డాక్టర్ మంజు పూరి తెలిపారు. ఈ విధంగా తల్లికి కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చే వరకు తల్లికి బిడ్డకు దూరం పాటిస్తూ కేవలం పాలు పట్టించడానికి మాత్రమే తల్లి దగ్గరకు తీసుకెళ్లాలని తెలియజేశారు.
Share your comments