దేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన విలయ తాండవం మరవకముందే,కరోనా థర్డ్ వేవ్ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఇప్పటికే పలు వైద్య ఆరోగ్య సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దానికి అనుగుణంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా థర్డ్ వేవ్ నుసమర్థవంతంగా ఎదుర్కొనడానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ ప్రజలను కరోనా నుంచి రక్షించడానికి ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది.
ప్రస్తుతం కరోనా వైరస్ ఆల్ఫా,బీటా, డెల్టా ఇలా కొత్త కొత్త వేరియంట్లుతో ప్రజలను వణికిస్తూ భయాందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు చిన్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి కాలేదు. పైగా కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తుండటంతో చిన్న పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొన్న తరుణంలో ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా చెప్పిన శుభవార్త చిన్నపిల్లల తల్లిదండ్రులకు కొంత ఊరటనిచ్చిందనే చెప్పుకోవచ్చు.
కరోనా థర్డ్‌వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే హెచ్చరికలు నేపథ్యంలో
యుద్ధ ప్రాతిపదికన సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించేందుకు అసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా తెలుపుతూ,వ్యాక్సిన్ కోసం మొత్తం మూడు కంపెనీలకు ఆగస్టు,సెప్టెంబర్ నాటికి అనుమతి లభించవచ్చని ధీమా వ్యక్తంచేశారు.
ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే పిల్లలను కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుకోవడమే కాకుండా, చిన్నపిల్లల్లో కరోనా వ్యాప్తిని కూడా సమర్థవంతంగా అరికట్ట వచ్చు అని రణ్‌దీప్ గులేరియా ఆశాభావం వ్యక్తం చేశాడు.
Share your comments