కీర దోసకాయ తినడంతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ కీర దోసకాయ అనేక పోషకాలను కలిగి ఉంటుంది. కీర దోసకాయ మన శరీరంలో చేదు కొవ్వును అదుపులో ఉంచటానికి సహాయపడుతుంది. తద్వారా మన శరీర బరువు అదుపులో ఉంటుంది. ఇవి ఎక్కువగా మనకి వేసవి కాలంలో లభ్యమవుతాయి. ఈ దోసకాయయు అనేవి కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే లేకుండా మన అందాన్ని కాపాడటంలోనూ ఉపయోగపడుతుంది.
వేసవి కాలంలో ఎక్కువగా మన శరీరం నీటిని కోల్పోతుంటుంది. ఇందుకొరకు ఈ కాలం మనం ఎక్కువగా నీతి శాతం ఉన్న పండ్లను, కూరగాయలను తింటూ ఉండాలి. ఆవిధంగా అధిక నీటి శాతం ఎక్కువ కలిగి ఉండే పదార్ధాల్లో కీర దోసకాయ కూడా ఒకటి. దీనిలో ఇంచుమించుగా 96 శాతం నీరును కలిగి ఉంటుంది. కాబట్టి ఈ కీర దోసను తినడం వలన మన శరీరం కోల్పోయిన నీటిని సరిచేయవచ్చు.
మన శరీరానికి చలువ చేయడానికి ఈ కీర దోసకాయ చాల బాగా పనిచేస్తుంది. కనుక దీనిని వేసవి కాలంలో మన ఆహారంలో చేర్చుకోవడం చాల ముఖ్యం. ఎక్కువగా దోసను నేరుగా తినడంకన్నా సలాడ్స్లో ఉపయోగించి తింటారు. ఇలా ప్రతి రోజు తినడం వలన మన శరీరంలో చేదు కొవ్వు తగ్గి, బరువు అదుపులో ఉంటుంది. బరువు కనుక వేగంగా తగ్గాలి అనుకుంటే రోజుకు రెండు కీర దోసకాయలను తింటే బాగా పనిచేస్తుంది. ఇది మన చర్మానికి ప్రకృతిసహజ మెరుపును అందిస్తుంది. వెంట్రుకలను బలంగా చేసి, జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి..
షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే పండ్లు..
కీరా దోసకాయను రోజూ తినడం వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోతాయి. అలాగే కిడ్నీల్లో ఏర్పడ్డ రాళ్లను కరిగించడంలో కీరా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కళ్లు అలసిపోవడం, కళ్ల కింద క్యారీ బ్యాగ్స్.. లాంటి సమస్యలతో బాధపడుతున్న వాల్లు చల్లటి కీరా ముక్కల్ని కళ్లపై కాసేపు పెట్టుకోవడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. ఈ కీరలో కొలెస్ట్రాల్ అనేహి ఉండదు, కాబట్టి ఇది తినడం వలన గుండె సంభందిత సమస్యలు దూరమవుతాయి.
విటమిన్ కె అనేది ఈ కీరాలో ఎక్కువగా ఉండడం వలన మన శరీరం ఎక్కువ శాతం కాల్షియమ్ తీసుకోవడానికి తోడ్పడుతుంది. దీని ద్వారా ఎముకలు కూడా దృడపడతాయి. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి, క్యాన్సర్ వచ్చే అవకాశాలను కీరా చాలా వరకు తగ్గిస్తుందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ఈ కీర అనేది మన నోటి దుర్వాసనను పోగొట్టడంలో ఉపయోగపడుతుంది. మన శరీరంలో జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే విధంగా ఇందులో ఎక్కువ పీచు పదార్ధాలను కలిగి ఉంటుంది.
ఇది కూడా చదవండి..
Share your comments