
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవన శైలిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆహార విషయంలో కూడా పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకోవడంతో అధిక శరీర బరువు పెరుగుతున్నారు.ఈ విధంగా అధిక శరీర బరువు ఆరోగ్యానికీ ప్రమాదమేనని భావించినప్పుడు తప్పకుండా శరీర బరువు తగ్గడానికి చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సులభంగా శరీర బరువు తగ్గడం కోసం జీలకర్ర ఎంతో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.జీలకర్రని ఉపయోగించి శరీర బరువును ఏవిధంగా తగ్గించుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
జీలకర్రను మనం ప్రతిరోజూ వంటలలో విరివిగా ఉపయోగించే సుగంధ ద్రవ్యం. ఇది ఆహారానికి రుచిని వాసనలు మాత్రమే కాకుండా మనకు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కల్పిస్తుంది.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి జీలకర్రను ప్రతి రోజూ మన ఆహారంలో భాగంగా చేసుకోవడం లేదా ప్రతి రోజూ ఒక గ్లాస్ జీలకర్ర జ్యూస్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి శరీరం బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
జీలకర్రలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్ మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపించడానికి దోహదపడతాయి. ఈ క్రమంలోనే ప్రతి రోజు ఒక గ్లాస్ నీటిలోకి టీ స్పూన్ వాము, టీ స్పూన్ జీలకర్ర రెండు గంటలపాటు నానబెట్టి ఆ నీటిని మరిగించి తాగటం వల్ల మన శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఈ క్రమంలోనే ఈ రుచి నచ్చకపోతే అందులోకి రెండు ఆకులు, నిమ్మరసం లేదా తేనె కలుపుకుని తాగినా కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ విధంగా వాము జీలకర్ర కలిపిన నీటిని మూడు నెలల పాటు క్రమంగా తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా మలబద్ధకాన్ని కూడా నివారించవచ్చు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత ఐరన్ సమృద్ధిగా లభించడంతో రక్తహీనత సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు.
Share your comments