ఎన్నో ఔషధ గుణాలు ఉన్న కరివేపాకును,
కరివేపాకు ఆయిల్ ను ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, క్యాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ ,ఫోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరటిన్,మాంసకృత్తులు,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కావున
భవిష్యత్తులో వచ్చే ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.అలాగే కరివేపాకు ఆయిల్ సుగంధ ద్రవ్యంగా వంటకాల్లో రుచి, వాసనను అందిస్తుంది.
కరివేపాకు నూనెలో విటమిన్ ఏ, ఈ అధికంగా ఉంటుంది కావున ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల విటమిన్ ఎ కంటి
సమస్యలను దూరంచేసి కంటిచూపును మెరుగు పరుస్తుంది. విటమిన్ ఇ జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.కరివేపాకు ఆయిల్లో ఐరన్, ఫైబర్, ఫోలిక్‌యాసిడ్ వంటివి అధికంగా ఉంటాయి ఇవి రక్తహీనత,గుండె జబ్బులు, కిడ్నీ ,జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి.
కరివేపాకు ఆయిల్ లో ఉన్న ఔషధ గుణాలు
ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరచి రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది తద్వారా చక్కెర వ్యాధికి చెక్ పెట్టవచ్చు. కరివేపాకు ఆయిల్ తయారు చేసుకోవడానికి ప్రాథమికంగా ఏదైనా నూనెతో తాజా కరివేపాకు ఆకులను కలవడం వల్ల కరివేపాకులో ఉన్న ఔషధ పోషక విలువలు ఆ నూనెలో కలిసిపోతాయి.మీరు ఈ నూనెను ఫిల్టర్ చేయవచ్చు లేదా కరివేపాకు కలిసిన మిశ్రమ నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనె మిశ్రమాన్ని గాలి తగలని జాడీలో నిలువ వుంచి ఎప్పుడైనా ఉపయోగించవచ్చు.
Share your comments