మనం రోజు వారి ఆహారం లో రక రకాల పండ్లు, కూరగాయలు తీసుకుంటాం వాటిలో మనకు కొన్నింటి ద్వారా కలిగే ప్రయోజనాలు మాత్రమే తెలుసు , అయితే మనం ఇక్కడ రోజువారీ ఆహారం లో తీసుకునే బీట్రూట్ గురించి తెలుసుకుందాం .
బీట్రూట్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఎందుకంటే బీట్రూట్లో అన్ని ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. ఇక ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి.మీరు ఖాళీ కడుపుతో బీట్రూట్ను తీసుకుంటే, అది రక్త హీనత నుంచి బయటపడేదుకు సహాయపడుతుంది , చర్మా కాంతిని మెరుగుపరుస్తుంది, అలాగే అనేక ఇతర ఆరోగ్య సమస్యలను తొలగిస్తుంది.
ప్రయోజనాలు:
బీట్రూట్ తినడం వల్ల మూత్రం సక్రమంగా వెళ్లి శరీరంలో నిల్వ ఉన్న టాక్సిన్స్ కూడా మూత్రంతో బయటకు వస్తాయి.బీట్రూట్లో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది.
బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నందున, మొటిమలు ఇంకా మచ్చలు వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇంకా అలాగే ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల కూడా చర్మం మెరుగుపడుతుంది.
బీట్రూట్లో పొటాషియం ఉంటుంది.ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.ఖాళీ కడుపుతో బీట్రూట్ తీసుకుంటే,
ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఎందుకంటే బీట్రూట్లో ఐరన్, విటమిన్లు వంటి అంశాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి వైరస్లు ఇంకా బ్యాక్టీరియా బారిన పడకుండా మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి.
మహారాష్ట్ర: లంపీ వైరస్ బారిన పడి 25 జిల్లాల్లో 126 పశువులు మృతి !
బీట్రూట్ వుండే పోషకాలు :
ఎందుకంటే బీట్రూట్లో పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం, అయోడిన్, ఐరన్, విటమిన్ బి1, బి2 ఇంకా అలాగే విటమిన్ సి వంటి అంశాలు ఉంటాయి. ఇది ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకరమైనదని రుజువు చేస్తుంది.
శరీరంలో రక్తం లేకపోతే ఖాళీ కడుపుతో బీట్ రూట్ తీసుకోవడం చాలా మంచిది.ఎందుకంటే శరీరంలో రక్తం లేకపోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపిస్తుంది. ఇంకా అలాగే ఈ బీట్రూట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
అందుచేత దీనిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య చాలా ఈజీగా తొలగిపోతుంది.బరువు తగ్గించడంలో చాలా సహాయకారిగా నిరూపిస్తుంది. బీట్రూట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీరు బీట్రూట్ను ఖాళీ కడుపుతో తీసుకుంటే అది త్వరగా ఆకలిని కలిగించదు. అందువల్ల ఇది బరువు నియంత్రణకు దారితీస్తుంది.
Share your comments