సాధారణంగా మనం తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణం కావాలంటే తప్పనిసరిగా నీటిని తీసుకోవాలి అని చెబుతారు.నీరు కేవలం మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. అదేవిధంగా మన శరీరంలో పేరుకుపోయిన మలినాలను, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి నీరు ఎంతగానో దోహదం చేస్తుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నప్పుడు మాత్రం ఎలాంటి పరిస్థితులలో కూడా నీటిని తాగకూడదు అని నిపుణులు చెబుతున్నారు. మరి ఆహార పదార్థాలు ఏమిటి? వాటిని తిని నీటిని తాగడం వల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం...
మనం పండ్లను తిన్న తర్వాత నీటిని తాగకూడదు అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పండ్లలో అధిక శాతం నీటిని కలిగి ఉండటమే కాకుండా మన శరీరానికి అవసరమైనన్ని పోషకాలు కూడా పండ్లలో ఉంటాయి. అలాగే పండ్లలో షుగర్ కంటెంట్ లేదా సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. అందుకే పండ్లు తిన్న తరువాత సుమారు 45 నిమిషాల పాటు నీటిని తాగకూడదు. అలాగే చాలా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నీటిని తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల చిగుళ్ళు బలహీనపడి దంతాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి కనుక ఐస్ క్రీమ్ తిన్న వెంటనే నీటిని తాగకూడదు.
ఈ క్రమంలోనే చాలామందికి వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగిన తర్వాత వెంటనే గ్లాస్ నీటిని తాగే అలవాటు ఉంటుంది. అయితే వేడిగా తాగిన వెంటనే నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. కనుక వీలైనంత వరకు కాఫీ వంటి పానీయాలు తాగినప్పుడు నీటిని తాగకండి. చాలామంది స్వీట్స్ తిన్న తర్వాత నీటిని తాగుతారు. స్వీట్స్ లో ఉన్న చక్కెర దంతాలలో ఉండటం వల్ల క్యావిటీస్ ఏర్పడతాయన్న భావనలో నీటిని తాగుతారు. ఇలా నీటిని తాగటం వల్ల మన శరీరంలో చక్కెర పరిమాణం పెరిగి టైప్ 2 డయాబెటిస్ కు కారణం అవుతుంది. భోజనం చేయడానికి 45 నిమిషాలు ముందు ఆ తర్వాత నీటిని తాగకూడదు. అదేవిధంగా భోజనం మధ్యలో చాలా మంది నీటిని తాగుతారు. ఇలా తాగడం వల్ల మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణ కాక జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి కనుక ఆహార పదార్థాలను తీసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులలో నీటిని తాగకూడదు.
Share your comments