Health & Lifestyle

పెరుగుతో కలిపి ఈ పదర్థాలు తినకూడదు... ఎందుకో తెలుసా?

KJ Staff
KJ Staff
Curd
Curd

కాలంతో పాటు మన ఆహారపు అలావాట్లలోనూ అనేక రకాల మార్పులు వస్తున్న సంగతి తెలిసిందే.  చాలా మంది విభిన్న రకాల ఆహార పదర్థాలు తీసుకున్నప్పటికీ.. రోగ నిరోధక శక్తి పెరిగేలా చూసుకుంటున్నారు. దీనిని ప్రధాన కారణం కరోనానే అని చెప్పలి. అయితే, మనం తినే పదర్థాల్లో అనేక లాభాలు కలిగించే వాటిలో పెరుగు కూడా ఒకటి. దీనిని నిత్యం ఆహారగా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మన జీర్ణశక్తిని మెరుగుపర్చి ఉష్ణాన్ని తగ్గిస్తాయి.  అయితే, పెరుగుతో కలిపి కొన్ని పదర్థాలు తీసుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని వైద్యారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతో తినకూడని ఆ పదర్థాలు.. అవి కలిపితింటే వచ్చే అనారోగ్య సమస్యల గురించి వారు చెప్పిన వివరాల ప్రకారం..

మన దేశంలో చాలా మంది ఆహారంతో నూనెలు, నెయ్యి కలిపి తీసుకుంటూ ఉంటారు. అయితే, పెరుగు తినే సమయంలో లేదా పెరుగు తిన్న వెంటనే నూనెలో వేయించిన పదర్థాలు తీసుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, నెయ్యి సంబంధిత పదర్థాలు కూడా తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే అలాంటి పదర్థాలను తీసుకుంటే జీర్ణక్రియ సంబంద వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అలాగే, అధికంగా మాంసకృత్తులు ఉండే పదర్థాలు ఒకే సారి తినకూడదు. అలాంటి వాటిల్లో పెరుగు, చేపలు కూడా ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల జీర్ణ సంబంధ, పలు రకాల చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి.

మరికొంత మంది పాలు, పెరుగు ఒకే సమయంలో ఆహారంతో పాటు తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యారోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పాలు, పెరుగు రెండింటిలో కొవ్వు అధికంగా  ఉంటుంది. ఒకే సమయంలో పాలు, పెరుగు తీసుకుంటే విరేచనాలు వచ్చే అవకాశం అధికం. అలాగే, గుండే మంట, కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అలాగే, ఎసిడిటీ, జీర్ణ సంబంధ వ్యాధులు వస్తాయి.  ఇక కొన్ని పండ్లతోనూ పెరుగును కలిపి తినకూడదు. వాటిల్లో మామిగి ఒకటి. మామిడి పండు, పెరుగు కలిపి ఆహారంగా తీసుకుంటే ఎలర్జీ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Share your comments

Subscribe Magazine