కొంతమందికి ఆకలి తక్కువ... మరికొంతమందికి ఆకలి ఎక్కువ ఉంటుంది. జీర్ణించుకునే శక్తి, చేసే పనులను బట్టి ఫుడ్ ఎంత తీసుకోవాలనేది ఆధారపడి ఉంటుంది. ఎండలో కష్టపడేవారు, ఏసీలలో కూర్చోని పనిచేసేవారు మధ్య ఫుడ్ తీసుకోవడంలో చాలా తేడా ఉంటుంది. ఎవరి పనిని బట్టి.. దానికి తగ్గట్లు ఆహారం తీసుకోవాలి. కొంతమంది ఎప్పుడూ ఏదోకటి చిరు తిండ్లు లాంటివి తింటూ ఉంటారు. ఆకలి వేసినప్పుడల్లా చిరుతిండ్లు తింటూ ఉంటారు. బిస్కెట్స్, చాక్లెట్స్ లాంటివి తింటూ ఉంటారు. కొంతమంది ఆహారం మీద శ్రద్ధ పెట్టకుండా ఏవి పడితే అవి తింటూ ఉంటారు. ఇది మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆకలిగా ఉన్నప్పుడు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కొన్ని ఆహారాలు తీసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ఆకలి బాగా వేసినప్పుడు నూడుల్స్, బిస్కెట్లు, వేఫర్స్, జ్యూస్, షుగర్ ఎక్కువగా ఉండే ప్రోటీన్ బార్స్ తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాగా ఆకలి వేసినప్పుడు పీనట్ బటర్‌తో కలిపి యాపిల్ తింటే మంచిదని సూచిస్తున్నారు. ఇక బాదంపప్పు, ఖర్జూరం, నట్స్ లాంటివి తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
ఇక వేయించిన శనగలు, అటుకులు తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుందని న్యూట్రీషన్లు చెబుతున్నారు. వీటిలో ప్రోటీన్స్, కార్చోహైడ్రేడ్స్ ఎక్కువగా ఉంటాయని, ఆకలి పోతుందని చెబుతున్నారు. ఇక బాగా ఆకలిగా ఉన్నప్పుడు చిప్స్ లాంటివి తినేందుకు చాలామంది ఇష్టపడతారు. కానీ అవి తినడం వల్ల ఆరోగ్యం చెడిపోయే ప్రమాదముందని, అసలు తినకూడదని హెచ్చరిస్తున్నారు. ఇలా కాకుండా ఆకలి వేసినప్పుడు ఏవి పడితే అవి తింటే ఆరోగ్యానికి ముప్పు అని సూచిస్తున్నారు.
చాలామంది బాగా ఆకలి వేసినప్పుడు బిస్కెట్స్ ఎక్కువ తింటూ ఉంటారు. దాని వల్ల అప్పటికప్పుడు ఆకలి తీరుతుంది కానీ ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక బాగా ఆకలి వేసినప్పుడు టీ, కాఫీ లాంటివి తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని చెబుతున్నారు.
Share your comments