సాధారణంగా మన ఇంట్లోఆహార పదార్థాలు మిగిలిపోతే వాటిని ఫ్రిజ్లో భద్రపరిచి మరుసటి రోజు వేడి చేసుకొని తినడం అలవాటుగా ఉంటుంది. అయితే ఈ విధంగా నిల్వ చేసిన ఆహార పదార్థాలను వేడి చేసి తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాలామంది వారికి కావలసినప్పుడల్లా ఆహార పదార్థాలను వేడి చేసి మరీ తింటారు. ఇలా తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ క్రింది తెలిపిన ఆహారపదార్థాలను అసలు వేడిచేసి తినకూడదు. మరి ఆహార పదార్థాలు ఏమిటి ఇక్కడ తెలుసుకుందాం...
సాధారణంగా మనం పాలకూర లేదా ఆకుపచ్చని కూరగాయలుతో వివిధ రకాల వంటలను తయారు చేస్తాము. ఈ కూరలతో చేసిన వంటలు మిగిలిపోతే వాటిని ఫ్రిజ్లో ఉంచి పదేపదే వేడిచేసి తినకూడదని నిపుణులు చెబుతున్నారు నిజానికి ఈ ఆకుపచ్చని ఆకుకూరల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. పదే పదే కూరలను వేడిచేయడం వల్ల ఐరన్ ఆక్సైడ్ గా మారిపోతుంది. ఐరన్ ఆక్సీకరణ చెందటం వల్ల ఎన్నో రకాల సమస్యలు వెంటాడతాయి.
చాలామంది మిగిలిన అన్నం మరుసటి రోజు వేడి చేసుకుని తినడం చేస్తుంటారు. అయితే అన్నం వండిన రెండు గంటల వ్యవధి వరకు తాజాగా ఉంటుందని, ఆపై అన్నం పై బ్యాక్టీరియా ఏర్పడుతుంది.ఈ క్రమంలోనే రెండు గంటల తర్వాత ఎలాంటి పరిస్థితులలో అన్నం బయట నిల్వచేసుకుని తినకూడదని నిపుణులు చెబుతున్నారు.ఈ విధంగా మిగిలిన అన్నం తినడం వల్ల కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. గుడ్లలో అధిక ప్రోటీనులు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గుడ్డును ఉడకబెట్టిన రెండు గంటల వ్యవధిలోనే తినేయాలి.ఒక వేళ చల్లగా అయిన చల్ల గుడ్డును తినాలి కాని మరి ఉడకబెట్టి తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఉంటాయి. ఈ క్రమంలోనే చికెన్ అధిక సార్లు వేడి చేసి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పై తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి. పుట్టగొడుగులతో తయారు చేసిన రెసిపీ లను కూడా పదేపదే వేడిచేసి తినకూడదు.ఈ విధంగా వేడిచేసి తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి వాంతులు విరోచనాలకు దారి తీస్తాయి.
Share your comments