వర్షాకాలం ప్రారంభం అవడంతో చాలా మందిలో సీజనల్ వ్యాధుల భయం వెంటాడుతూ ఉంటుంది. కావున సీజనల్ గా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి మొదటగా మన శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడమే చక్కటి పరిష్కార మార్గం.వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంతో పాటు సీజన్లో దొరికే తాజా పండ్లను ఆహారంగా తప్పకుండా తీసుకోవాలి.
ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి వంటి పళ్ళును ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన విటమిన్ సి, కాల్షియం విరివిగా లభిస్తాయి.వివిధ రకాల సీజనల్ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక రోగాలను సైతం ఎదుర్కొనేలా వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ఈ పండ్లు కీలక పాత్ర వహిస్తుంది.ఈ పండ్లను సాధ్యమైనంతవరకు జ్యూస్ రూపంలో కాకుండా పండ్ల రూపంలోనే తీసుకోవడం ఉత్తమం.
ఆపిల్ పండులో పీచుపదార్థం, విటమిన్ సి, విటమిన్ కె ఎక్కువగా ఉంటాయి.ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచడం తో పాటు శరీరంలో మలినాలను తొలగించి బరువు తగ్గడానికి ,చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుంది .మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన కివీ పండులో నారింజ , బత్తాయి కంటే అధిక మొత్తంలో సి విటమిన్ ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.కావున రోజువారి ఆహారంలో కివి పండును కూడా తీసుకోవచ్చు.దానిమ్మ పళ్లలో విటమిన్ సి, విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి కావున రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి దానిమ్మ సహకరిస్తుంది. ఇలా వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చు.
Share your comments