Health & Lifestyle

ప్రతిరోజు గోరువెచ్చని పసుపు నీళ్లు తాగుతున్నారా.. అయితే ఏం జరుగుతుందో చూడండి..?

KJ Staff
KJ Staff

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కోసం ఎంతో తాపత్రయ పడుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆహారంలో భాగంగా కొన్ని పదార్థాలను కూడా తీసుకుంటున్నారు. మరికొందరు కొన్ని మందులను కూడా వాడుతున్నారు. నిజానికి బయట దొరికే మెడిసిన్స్ కంటే మనం ఇంట్లో వాడే నిత్యావసర పదార్థాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిరోజు వంటలలో ఉపయోగించే పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక ఆ పసుపును మనం వండుకునే వంటలో వేయడం కంటే దాన్ని నేరుగా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

ఇందులో ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది చర్మానికి కూడా మంచి మేలు చేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఓ చిటికెడు పసుపు పొడిని వేసుకుంటే చాలు ఎంతో మేలు ఉంటుంది. ఎందుకంటే ఇందులో కర్కుమిన్ అనే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇక ఈ నీటిని తాగడం వల్ల చర్మానికి ఎటువంటి మేలు చేస్తుందో తెలుసుకుందాం..

కడుపులో మంట నివారణ: చాలామంది కడుపులో మంటతో బాధపడుతుంటారు. ఆ నొప్పినుండి బయటపడటానికి మందులు కంటే పసుపు నీళ్లు తాగడం వల్ల మంచి లాభం ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి ఉండే చికాకులు తొలగిస్తుంది. కీళ్ల నొప్పులను కూడా సులువుగా తగ్గించుకోవచ్చు.

కాలేయ సమస్య నుండి ఉపశమనం: ఎవరికైనా కాలేయంలో ఏమైనా సమస్యలు ఉంటే ముందుగా వాటి నుండి ఉపశమనం కోసం గోరువెచ్చని పసుపు నీటిని తీసుకోవాలి. దీని వల్ల అందులో ఉండే విషపదార్థాలు వెంటనే బయటకు తొలగిపోతాయి.

మెరుగైన జీర్ణ వ్యవస్థకు: కొందరి ఏవి తిన్న వారికి జీర్ణవ్యవస్థ సరిగా ఉండదు. దానివల్ల గ్యాస్ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటి నుండి ఉపశమనం కోసం పసుపు నీటిని తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

చర్మ సమస్యల నివారణ: చర్మంపై ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. అందులో ముఖ్యంగా మచ్చలు చాలావరకు పెద్ద సమస్య అనే చెప్పవచ్చు. ఇటువంటి మచ్చలు తొలగించుకోవడం కోసం నిమ్మకాయ రసంలో పసుపు పొడి, తేనెను వేసి కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల మంచి మార్పు కనిపిస్తుంది. అంతే కాకుండా చర్మంపై ముడుతల్ని కూడా నివారిస్తుంది.

Share your comments

Subscribe Magazine