చాలా మంది ప్రజలు ఉదయం లేవగానే ఒక గ్లాసు నీళ్లల్లో తేనె మరియు నిమ్మకాయ రసాన్ని కలుపుకుని తాగుతూ ఉంటారు. ఎలా తాగడం వాళ్ళ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. ఆరోగ్యం కోసం, బరువు తగ్గడం కోసం ఉదయాన్నే తేనె కలిపిన నిమ్మనీళ్లు తాగుతారు. మరి ప్రతిరోజు ఈ నీళ్లు అందరూ తాగవచ్చా, దీన్ని తాగడం వల్ల నిజంగానే బరువు తగ్గుతారా అనేది కొందరి ప్రశ్న. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఈ తేనె మరియు నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వలన నిజంగా శరీరానికి ఎంత మేలు జరుగుతుంది. కానీ ఈ నీళ్లు కొంతమంది తాగితే వారికి మంచిదికాదు. అలాగే పరిగడుపున తాగకూడదని కొందరంటే.. అదే మంచిదని ఇంకొందరంటారు. ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
ఇవి తాగడం వలన మనకి నీరసం రాకుండా వెంటనే శక్తీ వస్తుంది. దీనితో మనం రోజు అంతటా చురుగ్గా ఉండవచ్చు. ఈ తేనెను తీసుకోవడం వలన ఆహారం జీర్ణం అవడంలో మనకి సహాయం చేస్తుంది. నిద్రపోవడానికి ముందు ఒక స్పూన్ తేనె తీసుకుంటే చక్కగా నిద్ర వస్తాది. మన శరీరంలో ఉన్న మళినాలను బయటకు పంపడంలో కూడా తేనె సాయపడుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. నిమ్మలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఇది కూడా చదవండి..
గృహలక్ష్మి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం..
తేనె, నిమ్మరసం నీళ్లు తాగగానే కడుపులో మంటగా అనిపిస్తే అల్సర్ లేదా ఎసిడిటీ సమస్యలున్నట్లు గ్రహించాలి. ఒకసారి వైద్యులను సంప్రదించాలి. ఈ సమస్యలు ఉన్నపుడు ఈ నీళ్లు రోజూ తాగడం వల్ల కడుపునొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంది. తేనెలో చక్కెర ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధి ఉన్నవాళ్లకి ఇది మంచిది కాదు. పంచదార, తేనె, ఫ్రక్టోజ్ ఉన్న వాటికి దూరంగా ఉండటం మేలు.
ఇది కూడా చదవండి..
Share your comments