మనలో చాలా మందికి కాఫీ తాగకపోతే ఆ రోజు గడవడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే వేడి వేడి కప్పు కాఫీ తాగడం వల్ల ఎంతో హుషారుగా అనిపిస్తుంది దానికి కారణం కాఫీలోని కెఫిన్ అనే పదార్థం. కెఫిన్ మన నాడీవ్యవస్థను ఉత్తేజపరిచే గుణం ఉంటుంది కావున కాఫీ తాగిన వెంటనే మనకు అలసట తొలగి హుషారుగా ఉన్న భావన కలుగుతుంది.అయితే కాఫీ రోజుకు రెండు లేదా మూడు కప్పులు తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు కాఫీని మోతాదుకు మించి తాగితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలే నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ప్రతి రోజు 400 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకుంటే భవిష్యత్లో అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.400 మిల్లీగ్రాముల కెఫిన్ నాలుగు కప్పుల కాఫీ
తో సమానం.అలాగే ఈ సర్వే ప్రకారం రోజుకు 3 కప్పుల కాఫీ తాగితే గుండె సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని సూచించింది.

Share your comments