ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఉల్లిపాయ లేకుండా మనకి వంట అసాధ్యం, అయితే ఉల్లిపాయ మాత్రమే కాదు, మనం వలిచి పడేసే ఉల్లిపాయ తొక్క లతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసి ఉండదు. ఉల్లిపాయ గురించి మీరు ఇంకా తెలుసుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి.వాటి గురించి ఇక్కడ చూద్దాం.
మామూలుగు మనం ఉల్లిపాయలను వంట లలో ఉపయోగించినప్పుడు , తొక్కలు తీసి పడేస్తూ ఉంటాం . అయితే ఉల్లిపాయ యొక్క తొక్కలు చర్మ సమస్యలను నివారించడం లో సహాయపడతాయి .ఉల్లిపాయ తోలులో విటమిన్ ఏ, ఈ , సి అధికంగా ఉండడం వల్ల ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. దురదలు, ఎలర్జీల వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది.
ఉల్లిపాయ తొక్కలను నీటిలో మరగబెట్టి, చెక్కెర టీ ఆకులూ కలిపి తాగావచు. దీని రుచి కొంచం భిన్నంగా ఉన్నపటికీ దీనిలోని పోషకాల వాళ్ళ ఇది చర్మానికి మాత్రమే కాకుండా, గుండె మరియు కళ్ళ ఆరోగ్యానికి కూడా చాల మంచిది అని కొన్నీ ఆరోగ్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఉల్లి తొక్కులతో ప్రయోజనాలు:
1. ఉల్లిపాయ తొక్కలు, ఆమ్లీకరణ మరియు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడం లో సహాయపడతాయి.
2.ఉల్లిపాయ తోలు నీటిలో వేసి బాగా మరగబెట్టి వడగట్టి తాగండి . ఇలా తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడానికి సహాయపడుతుంది.
3.ఉల్లిపాయ తొక్కలలో విటమిన్ ఈ, సి ,ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ చర్మానికి ఆరోగ్యానికి మంచిది.దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చర్మం కాంతి వంతంగా ఆరోగ్యంగా మారుతుంది.
4. ఉల్లిపాయ తోలు నీటిలో వేసి మరిగించి వడగట్టి త్రాగడం వళ్ళ కండరాల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
5. ఉల్లిపాయ తొక్కల నానబెట్టిన నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టు మృదువుగా, ఆరోగ్యం గా ఉంటుంది.
6. ఉల్లిపాయ మరియు వెల్లుల్లి యొక్క బయటి తొక్కలు విటమిన్లు A, C, E మరియు అనేక యాంటీఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన మూలాన్ని అందిస్తాయి.
7. ఉల్లిపాయల తొక్కలు ఫ్లేవనాయిడ్ల యొక్క గొప్ప మూలం, ముఖ్యంగా క్వెర్సెటిన్ మొదలైన శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కలిగి ఉండడం వల్ల అల్లెర్జిలు, ఇన్ఫెక్షన్లకు మంచి ఔషధంగా పనిచేస్తుంది .
చూసారుగా, ఉల్లి తొక్కలతో ఎన్ని లాభాలున్నాయో ! ఈసారి నుండి ఉల్లిపాయలు వాడేటప్పుడు తొక్కలను పడేయకుండా పైన చెప్పినట్టు ఇదొక విధముగా ఉపయోగించండి, లేదంటే కంపోస్టు ల చేసి మొక్కలకు అయినా వాడొచ్చు.
ఇది కూడా చదవండి
Share your comments