కాఫీ డైట్ గురించి ఎప్పుడైనా విన్నారా? మనలో చాల మంది ప్రతి రోజు తమ దినచర్యని కాఫీ తో మొదలుపెడతాం, అయితే ఈ కాఫితో బరువు కూడా చక్కగా తగ్గుతుంది అని అందరికి తెలీదు. బరువు తగ్గాలని కృషి చేస్తున్న వాళ్ళు, ఆహారాన్ని తీసుకోకుండా ఉపవాసం ఉంటూ అధికంగా కాఫీ తాగడాన్ని కాఫీ డైట్ అని పిలుస్తారు, ఇది ఈ మధ్య బాగా ప్రచురణ పొందుతుంది.
ఈ కాఫీ డైట్ లో రోజుకు మూడు కప్పుల (720 మి.లీ) కాఫీ తీసుకోవచ్చు. మూడు కప్పుల కాఫీ ఆరోగ్యకరమైన ఫోలిఫెనాల్ యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. ఇది శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీని వళ్ళ ఆకలి వేయకుండా ఉంటుంది కాబట్టి చిరుతిండ్లు, అధిక ఆహారానికి దూరంగా ఉంటారు. ఈ పద్దతి లో కాఫీ తో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ పుష్కలంగా నీరు త్రాగాలి. కానీ రోజులో తీసుకునే కాఫీ మొత్తం 720 మి.లీ. మించకూడదు. అలాగే కాఫీ తాగే ప్రతిసారీ చక్కెర మరియు మీగడ/వెన్నను ఉపయోగించడం మానేయాలి.
ఇది కూడా చదవండి
ఆరోగ్యశ్రీ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అదేమిటంటే?
మీరు దీని ద్వారా తక్కువ సమయంలో తీవ్రమైన బరువు తగ్గడాన్ని కూడా సాధించవచ్చు. మీరు బరువు తగ్గించే ప్రణాళికను వదులుకుంటే, మీరు ఆరోగ్యకరమైన మార్గంలో బరువును తిరిగి పొందవచ్చు. మీ ఆహారపు అలవాట్లు మరియు వ్యాయామ అలవాట్లు ఆధారంగా, బరువు తగ్గడం మరియు పెరగడం ఆగిపోతుంది. కాఫీ తాగడం వల్ల శరీరంలోని క్యాలరీలను తగ్గించుకోవచ్చు. తదనుగుణంగా జీవక్రియకు దోహదం చేస్తుంది. తక్కువ వ్యవధిలో అధిక బరువును తగ్గించుకోవడానికి కూడా ఇది గొప్ప మార్గం.
ఇది కూడా చదవండి
ఆరోగ్యశ్రీ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అదేమిటంటే?
దీర్ఘకాలికంగా పాటిస్తే వచ్చే నష్టాలు:
బరువు తగ్గే లక్ష్యం తో కాఫీ తాగేవారు సాధారణంగా రెండు నుంచి ఏడు వారాల పాటు కొనసాగుతారు. దీర్ఘకాలికంగా పాటిస్తే ఇది ఆరోగ్యకరమైన పద్దతి కాదు. కేవలం కెఫిన్ మీ శరీరంలోకి ఎక్కువ కాలం వెళ్లడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలకు సులభంగా దారి తీస్తుంది. డిప్రెషన్, నిద్రలేమి, హిమోగ్లోబిన్ తగ్గడం, మలబద్ధకం, శరీరం పొడిబారడం, డీహైడ్రేషన్ వంటి అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల, ఏ పద్ధతిని నిరంతరం కొనసాగించకూడదు. అమృతం ఎక్కువగా తీసుకుంటే విషం అయినట్లే, కాఫీలో మంచి గుణాలు ఉన్నప్పటికీ, అతిగా వాడితే సమస్యలు వస్తాయి
ఇది కూడా చదవండి
ఆరోగ్యశ్రీ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అదేమిటంటే?
image source: pexels.com, istock
Share your comments