ఆనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలంటే ప్రతి రోజు పళ్ళను తినాలి. అంతర్జాతీయ రవాణా మెరుగుపడిన తర్వాత ఎన్నో రకాల ఫలాలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో కివి ఒకటి, కివి పండు భరత్ దేశానికి చెందినది కాదు, అయినప్పటికీ దీనిలోని ప్రయోజనాలు ఎన్నో.
కివి పళ్ళను తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. కివి పళ్ళు పచ్చివి మరియు ఎండబెట్టినవి రెండు అందుబాటులో ఉన్నాయి. ఎండబెట్టిన కివి లను డ్రై ఫ్రూయట్ షాప్స్ లో విక్రయించడం గమనించవచ్చు. వీటిని రోజు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఎండ కివి పళ్ళ నుండి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచగల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, శరిరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ వీటినే క్యాన్సర్ కారకులుగా భావిస్తారు వీటిని నిర్ములిస్తాయి. క్యాన్సర్ కలిగించే ఈ ఫ్రీ రాడికల్స్, గాలి కాలుష్యం నుండి, యూవీ రేస్ నుండి మరియు రసాయన ఎరువుల నుండి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. వీటిని అదుపుచెయ్యకుంటే, డిఎన్ఏ ఫై ప్రభావం చూపించి క్యాన్సర్ వ్యాధిని కలిగిస్తాయి. ఎండ బెట్టిన కివిని తినడం ద్వారా ఫ్రీ రాడికల్స్ నియంత్రించబడతాయని వైధ్యులు సూచిస్తున్నారు.
ఎండిన కివి ముక్కల్లో విటమిన్ బి, సి, పొటాషియం ఖనిజాలు ఉంటాయి. విటమిన్-సి అనారోగ్య సమస్యలు నుండి రక్షిస్తుంది, వాతావరం మార్పుల ద్వారా వచ్చే జలుబు, దగ్గు, నుండి ఉపశమనం కల్పించడంలో విటమిన్- సి తోడ్పడుతుంది. కివి ముక్కలను తినడం ద్వారా శరీరానికి అవసరమైన పొటాషియం లభిస్తుంది. రక్తపోటు లేదా బీపీ ఉన్నవారిలో పొటిషియం అధిక రక్తపోటును సరిచెయ్యడంలో సహాయపడుతుంది. మానసిక ఒత్తిడి ఉన్నవారికి కివి ఒక దివ్యౌషధం. కివిలో ఉండే సెరోటోనిన్ ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతుంది. పడుకునే ముందు కొన్ని ఎండిన కివి ముక్కలను తినడం మూలాన ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి మరియు ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించడానికి ఆహారంలో ఫైబర్ తప్పనిసరి. కివి లో అధిక మొత్తమలో ఫైబర్ ఉన్నందున పొట్ట ఆరోగ్యానికి చాల మంచిది.
Share your comments