Health & Lifestyle

స్టార్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని లాభాలు... గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది...

KJ Staff
KJ Staff

మనిషి ఆరోగ్యకరమైన జీవితం జీవించడానికి ఆహారం కీలకమైన పాత్ర పోషిస్తుంది. రోగాలు రాకుండా ఆరోగ్యకరంగా ఉండేందుకు శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, కొవ్వలు, పీచు పదార్ధాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఇలా చాల రకాల పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. పోషకవిలువలు అన్ని సంవృద్ధిగా లభించే ఆహారంలో పళ్ళు ఒకటి. దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు బలపడటం మూలాన, ఎన్నో రకాల ఫలాలు ఇప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. స్టార్ ఫ్రూట్ కూడా వీటిలో ఒకటి, ఈ పండును కొస్తే నక్షత్రం ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి స్టార్ ఆపిల్ అని పేరు. మార్కెట్లో చాలా అరుదుగా కనిపించే ఈ పండులో, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకవిలువలు ఉన్నాయి. అయితే ఎన్ని పోషకవిలువలు ఉన్నాసరే దీనిని తినడానికి చాలమంది ఇష్టపడరు, ఎందుకంటే పుల్లని రుచితో ఉంటుంది. అయితే దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం దీనిని వదిలిపెట్టారు.

తినే కొద్దీ వేప తియ్యగా మారుతుంది అన్నట్లు, ఈ స్టార్ట్ ఫ్రూట్ పండే కొద్దీ, పులుపు రుచి నుండి తీపిగా మారుతుంది. వేసవి కాలానికి ఈ పండు ఎంతో మంచిది ఎందుకంటీయే దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఈ స్టార్ ఫ్రూట్లో శరీరానికి ఎంతగానో అవసరమైన విటమిన్ - ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఎ కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది, విటమిన్- సి చర్మానికి సహజసిద్దమైన కాంతిని అందిస్తుంది, అలాగే దీనిలో యాంటీఆక్సిడెంట్లు రక్షణ కవచం లాగా పనిచేసి రోగాలు, ఇంఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. స్టార్ ఫ్రూట్లో ఫైబర్ సంవృద్ధిగా లభిస్తుంది, ఈ ఫైబర్ ఆహారం జీర్ణం కావడంలో సహాయం చేస్తుంది. మలబద్దకం పోగొట్టడంలో స్టార్ ఫ్రూట్ చక్కగా ఉపయోగపడుతుంది. దీనితోపాటు విరోచనాలు, వాంతులు, వికారం తదితర సమస్యలను తగ్గించడంలో కూడా స్టార్ ఫ్రూట్ బాగా పనిచేస్తుంది.

బరువు తగ్గాలని అన్ని రకాల కసరత్తులు చేసేవారు, ప్రతి రోజు స్టార్ ఫ్రూట్ తింటే, సులభంగా మరియు తొందరగా బరువు తగ్గించుకోవడానికి వీలుంటుంది. స్టార్ ఫ్రూట్లో సమావృద్ధిగా ఉండే విటమిన్ బి-12 మరియు జింక్ జుట్టు ఎదుగుదలలో సహాయపడుతుంది. ఈ పోషకాలు జుట్టు బలంగా మరియు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడతాయి. స్టార్ ఫ్రూట్ కి ఉన్న మరోక్కప్రత్యేకత ఏమిటంటే, దీనిలో ఎక్కువ ఫైబర్ మరియు తక్కువ క్యాలోరీలు ఉంటాయి, కాబట్టి రక్తంలో చెక్కెర స్థాయిలు పెరుగుతాయన్న భయం లేకుండా షుగర్ పేషెంట్స్ కూడా నిశ్చింతగా తినొచ్చు.

కొంతమందికి కడుపులో పుళ్ళు ఏర్పడతాయి, అటువంటి వారు స్టార్ ఫ్రూట్ తినడం వీటిని నయం చేసుకోవచ్చు. స్టార్ ఫ్రూట్ లోని బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. స్టార్ ఫ్రూట్ ని జ్యూస్ లాగా చేసుకొని ప్రతిరోజు తాగడం వలన పొట్ట మరియు శుభ్రమవుతాయి. అంతేకాకుండా శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కూడా బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ఈ పండును తినడం మూలాన ఆస్తమా మరియు శ్వాసకోస సమస్యలు కూడా నయమయ్యేందుకు వీలుంటుంది.

Share your comments

Subscribe Magazine