Health & Lifestyle

ఈ ఆహారపదర్ధాలు కొన్ని దేశాల్లో బ్యాన్....

KJ Staff
KJ Staff

ఈ మధ్యకాలంలో మన దేశంలోని అతి పెద్ద మసాలా బ్రాండ్లను కొన్ని దేశాల్లో బ్యాన్ చెయ్యడం వలన అవి వార్తల్లో నిలిచాయి. మన దేశంలో కూడా కర్ణాటకలో పాలురసాయన కారకాలు ఉన్నాయని, మంచూరియ మరియు పీచు మిఠాయిలను బ్యాన్ చెయ్యడం జరిగింది. అసలు కొన్ని ఆహార పదర్ధాల్ని కొన్ని దేశాల్లో ఎందుకు బ్యాన్ చేస్తారన్న సందేహం మీ అందరికి వచ్చే ఉంటుంది. ప్రతి దేశంలో ప్రజల ఆరోగ్య అవసరాల రీత్యా ఆహార చట్టాలు చెయ్యబడ్డాయి. మార్కెట్లో విక్రయించే ఆహార పదర్ధాలు ఏమైనా నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే వాటి బ్యాన్ చేస్తారు. ఇలా కొన్ని దేశాల్లో బ్యాన్ చేసిన కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నెయ్యి:

భారతీయ వంటకాల్లో నెయ్యికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. నెయ్యితో చేసిన వంటకాలను ఎంతో పవిత్రమైనవిగా భావించి వాటిని దేవునికి నివేద్యంగా సమర్పిస్తారు. అయితే అమెరికాలో మాత్రం నెయ్యిని విక్రయించడం నిషిద్ధం. అక్కడవారి ఆహారపు అలవాట్లు మరియు ఇతర పరిస్థితులకు ఆధారంగా నెయ్యిని తింటే, అధిక రక్తపోటు మరియు ఊబకాయం వస్తుందని భావించి నెయ్యిని నిషేధించారు.

కిండర్ జాయ్:

పిల్లలకు ఇష్టమైన చోక్లెట్లలో కిండర్ జాయ్ ఒకటి. టీవీ లో వచ్చే కిండర్ జాయ్ ప్రకటన చుసిన పిల్లలు దానిని కొనమని తల్లితండ్రులను అడుగుతారు. అయితే కిండర్ జాయ్ ని యునైటెడ్ స్టేట్స్ లోని చాలా రాష్ట్రాల్లో బ్యాన్ చేసారు. కిండర్ జాయ్ లో ప్లాస్టిక్ అణువులు ఉన్నాయని గుర్తించి వాటిని బ్యాన్ చేసారు. చిన్న పిల్లలు తినే ఆహారం పట్ల అక్కడి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది.

చవాన్ ఫ్రష్:

మన దేశంలో చవాన్ ఫ్రష్ కి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పనవసరం లేదు. చవాన్ ఫ్రష్ ను ముఖ్యమైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు. భోజనం చేసాక చవాన్ ఫ్రష్ తినడం చాలా మందికి అలవాటు. అయితే దీనిలో మార్ఫిన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండటం వలన సింగపూర్ మరియు టైవాన్ దేశాల్లో దీనిని బ్యాన్ చేసారు. తాజాగా దీనిని సౌదీ అరేబియా మరియు కెనడాలో కూడా బ్యాన్ చేసారు.

కెచప్:

సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు అనేక ఫాస్ట్ ఫుడ్స్ తినాలంటే కెచప్ తప్పనిసరి. ఈ ఆహారం రుచిని పెంచడంలో కెచప్ ఎంతో ఉపయోగపడుతుంది. కెచప్ ఫ్రాన్స్ కు చెందిన వంటకం, అయితే ఫ్రాన్స్ లోని స్కూళ్లలో దీనిని నిషేధించారు. అలాగే అక్కడివారు పిజ్జా మరియు ఫ్రెంచ్ ఫ్రైస్ తో కెచప్ తినడానికి ఇష్టపడరు.

చూయింగ్ గమ్:

మన దేశంలో చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు చూయింగ్ గమ్ అంటే ఇష్టపడనివారు ఉండరు. అయితే నమిలి పడేసిన చూయింగ్ గమ్, శుభ్రం చెయ్యడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఆసియా ఖండంలో హైపర్ క్లీన్, హైపర్ స్ట్రిక్ట్ దేశాల్లో సింగపూర్ ఒకటి. ఈ దేశంలో పరిశుభ్రతకూ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సింగపూర్ లో చూయింగ్ కొనుగోలు చెయ్యాలంటే కచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి.

Share your comments

Subscribe Magazine