జామపండు తినడానికి రుచిగా ఉండటమే కాకుండా జాములో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే జామపండును తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు. జామలో ఎన్నో పోషకాలు దాగివున్నాయి. కేవలం జామకాయలో మాత్రమే కాకుండా జామ ఆకులు బెరడు నుంచి కూడా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. జామకాయలలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్, పొటాషియం అధికంగా లభిస్తాయి. అదే విధంగా అధిక మొత్తంలో కేలరీలు ఫైబర్ లో కూడా లభిస్తాయి. జామను ప్రతి రోజూ తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు జామపండును తినకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సమస్యలతో బాధపడే వారు జామపండును తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం...
జామ పండులో విటమిన్ సి ఫ్రక్టోస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి రెండూ అధికంగా లభించడం వల్ల మనకు కడుపులో ఉబ్బరంగా అనిపిస్తుంది. అందుకోసమే గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడేవారు జామపండుకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా నిద్రపోయే ముందు జామపండును తినడం వల్ల కడుపు మొత్తం ఉబ్బరంగా ఉండి నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది.
జాములో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే మలబద్దకం సమస్యను కూడా నివారిస్తుంది. ముఖ్యంగా మీరు ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌తో బాధపడుతుంటే మితంగా తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మధుమేహంతో బాధపడే వారు జామను తినడం వల్ల చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని భావిస్తారు. అయితే 100 గ్రాముల జామాలో తొమ్మిది గ్రాములు సహజ చక్కెర ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల షుగర్ స్థాయి పెరుగుతుంది. అందుకే మధుమేహంతో బాధపడే వారు జామపండును మితంగా తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Share your comments