Health & Lifestyle

కొబ్బరి నీళ్లతో ప్రయోజనాలు

KJ Staff
KJ Staff
Cocunut
Cocunut

కొబ్బరి నీళ్లు.. తక్కువ క్యాలరీలతో ఎక్కువగా పోషకాలను అందించే సహజసిద్ధమైన డ్రింక్. ఇందులో నాలుగు అరటి పండ్లలో ఉండేంత పొటాషియం ఉంటుందట. సహజసిద్ధమైన కొవ్వులు, ఎలక్ట్రోలైట్స్ వంటివి ఎన్నో ఇందులో ఉంటాయి. అందుకే ఇది సహజమైన డ్రింక్ అని చెప్పుకోవచ్చు. ఎండాకాలం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అవేంటంటే..

కొబ్బరి కాయ ఎలాంటి రసాయనాలు కలపలేని ఏకైక పానీయం. అందుకే దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

* కొబ్బరి నీళ్లలో ఉన్న మాంగనీస్ శరీరంలోని కొవ్వు మెటబాలిజంని మెరుగు పరుస్తుంది. ఎంజైమ్ ల పనితీరును మెరుగు పరుస్తుంది.

* మీ డైట్ లో భాగంగా రోజూ కొబ్బరి నీళ్లు తాగితే స్ట్రాంగ్ గా తయారవడమే కాకుండా బరువు కూడా తగ్గి స్లిమ్ గా కనిపిస్తారట.

* కొబ్బరి నీళ్లు తాగడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల అతిగా ఆహారం తినే వీలుండదు. తద్వారా బరువు తగ్గే వీలుంటుంది. ఇందులోని ఫైబర్ ఎక్కువ సేపు పొట్ట నిండిన ఫీలింగ్ ని కలిగిస్తుంది.

* కొబ్బరి నీళ్లను తరచూ తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుందట.

* కొబ్బరి నీళ్లలోని పోషకాలు మన శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయులను కూడా అదుపులో ఉంచుతాయి.

* తాజా కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కరె స్థాయులు అదుపులో ఉంటాయి. శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కావడానికి కొబ్బరి నీళ్లలోని అమైనో యాసిడ్లు తోడ్పాటును అందిస్తాయి.

* కొబ్బరి నీళ్లు తాగడం గుండెకు చాలా మంచిది. దీనివల్ల గుండెపోటు వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. హై బీపీ సమస్య కూడా వీటిని తాగడం వల్ల తగ్గుతుంది.

* కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీవ క్రియల రేటు కూడా పెరుగుతుంది. తద్వారా స్లో మెటబాలిజంతో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలన్నింటినీ దూరంగా ఉంచే వీలుంటుంది.

కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలోని చిన్న సైజ్ రాళ్లు కూడా కరిగిపోతాయి. కిడ్నీల్లోని వ్యర్థ పదార్థాలు శరీరం బయటకు వెళ్లేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

* కండరాల తిమ్మిరి ని తగ్గించేందుకు కూడా కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉండడం వల్ల ఇలాంటివి ఎదురవుతుంటాయి. కొబ్బరి నీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని తీసుకోవడం వల్ల కండరాల తిమ్మిరి సమస్య ఉండదు.

* కొబ్బరి నీటిలో క్యాల్షియం, మెగ్నీషియం ఎక్కువగానే ఉంటాయి. ఇవి రెండూ మీ ఎముకలను బలంగా మారుస్తాయి.

* రక్తం గడ్డ కట్టే సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచి మందు అని చెప్పుకోవచ్చు. కొబ్బరి నీళ్లు ఈ సమస్యను తగ్గిస్తాయి.

* వాంతులు, విరోచనాల సమస్యతో బాధపడుతున్నప్పుడు ఓఆర్ ఎస్ ద్రావణాన్ని చాలామంది తీసుకుంటారు. ఇలాంటి సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మరింత మంచి ఫలితం ఉంటుంది.

* అప్పటికప్పుడు తక్షణ శక్తిని అందించేందుకు కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. అందుకే బాగా అలసిపోయినప్పుడు వీటిని తాగాలి. ఇది రక్తంలో వేగంగా కలిసిపోయి శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుంది.

* తలనొప్పి సమస్యతో బాధపడే వారు కూడా దాన్ని తగ్గించుకోవడానికి కొబ్బరి నీళ్లను తాగి చూడవచ్చు. ఇందులోని ఎలక్ట్రోలైట్లు తలనొప్పిని తగ్గిస్తాయి.

* కొబ్బరి నీళ్లలోని ట్రాన్స్ జేజిటిన్ జ్ఞాపకశక్తి పెంచేందుకు తోడ్పడుతుంది. అందుకే మతిమరుపు సమస్యతో బాధపడుతున్న వారు దీన్ని రోజూ తీసుకోవాలి.

* కొబ్బరి నీళ్లను రోజూ తీసుకోవడం వల్ల శరీరం డీటాక్సిఫికేషన్ చెంది చర్మం కూడా మంచి కాంతిని సంతరించుకుంటుంది. ఇందులోని పొటాషియం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా తయారవుతుంది.

* కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు, ముడతలు రాకుండా కాపాడుతుంది.

* కొబ్బరి నీటిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని రోజూ ఒకటైనా తీసుకోవడం వల్ల డిప్రెషన్ బారి నుంచి తప్పించుకునే వీలుంటుంది.

* రాత్రి పడుకునే ముందు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుందట. ఇందులోని గాబా న్యూరో ట్రాన్స్మిటర్ ఇందుకు కారణం. ఇది కండరాలను విశ్రాంతి తీసుకునేలా చేస్తూ నిద్రను అందిస్తుంది. అందుకే నిద్ర లేమితో బాధపడుతున్న వారు దీన్ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

* కొబ్బరి నీళ్లు మన శరీర రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది ఫ్రీ రాడికల్స్, వ్యాధులు కలిగించే వాటితో పోరాడి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది.

కొబ్బరి నీళ్ల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిసింది కదా.. ఇవన్నీ పొందాలంటే వీటిని కనీసం రోజుకు ఒకటి చొప్పున అయినా తాగడం మంచిది.

https://krishijagran.com/health-lifestyle/this-coconut-day-know-the-stone-fruit-more-closely/

https://krishijagran.com/health-lifestyle/eating-coconut-daily-will-give-you-these-amazing-health-benefits/

Share your comments

Subscribe Magazine