Health & Lifestyle

మీకు డయాబెటిస్ ఉందా.. అయితే ప్రతిరోజు పరగడుపునే ఈ ఆహారం తినండి..

KJ Staff
KJ Staff

ప్రస్తుతం చాలామంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. అందులో ఎక్కువగా డయాబెటిస్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి సమయానికి తినకపోవడం వల్ల.. పైగా కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినడం వల్ల ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. ధూమపానం, అసమతుల్యత, ఊబకాయం వల్ల మధుమేహం వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇది క్లోమా గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది.

ఈ గ్రంథి ఒక రకమైన హార్మోన్. ఇది శరీర రక్తంలో గ్లూకోజ్ లో కలిసి శరీరానికి శక్తిని అందిస్తుంది. దీంతో డయాబెటిక్ వాళ్ల శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి తక్కువ, ఎక్కువగా ఏర్పడుతుంది. చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే గుండె పోటు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ను మెడిసిన్స్ కంటే ఇంట్లో దొరికే కొన్ని పదార్థాల వల్ల కొంత వరకు తగ్గించుకోవచ్చు. ఇక వాటిని పరిగడుపున మాత్రమే తీసుకోవడం వల్ల మంచి మార్పు ఉంటుంది. ప్రస్తుతం అవేంటో తెలుసుకుందాం..

పచ్చిమిరపకాయలు: పచ్చిమిరపకాయలు మనం నిత్యం వండుకునే కూరల్లో ఉపయోగిస్తాం. ఇది రుచికి కారంగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా క్యాప్సైసిన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర ను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు పరిగడుపున 30 గ్రాములు పచ్చి మిరపకాయలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మెంతికూర: మెంతికూర ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఎ, బి, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫారిక్ యాసిడ్, ప్రోటీన్, ఫైబర్ లు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల మధుమేహ సమస్యతో బాధపడుతున్న వాళ్లకి మంచి ఫలితం ఉంటుంది. ఇక రాత్రి పూట ఒక గ్లాస్ లో టీ స్పూన్ మెంతి గింజలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి.

అల్లం: అల్లం కూడా శరీరానికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇది తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం తగ్గించుకోవచ్చు. ఇక దీనిని పరిగడుపున తీసుకోవచ్చు. అంతేకాకుండా ఉదయాన్నే తాగే టీ లో కూడా వేసుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine