Health & Lifestyle

లివర్ ఆరోగ్యం బాగుండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి....

KJ Staff
KJ Staff

మనిషి శారీరంలో అతిముఖ్యమైన భాగాల్లో లివర్ ఒకటి. మనిషి ఆరోగ్యంగా ఉంటాలంటే లివర్ పనితీరు సర్రిగా ఉండాలి. ప్రతి రోజు మనం ఆహారం ద్వారా తీసుకున్న ప్రోటీన్లు జీర్ణమై శరీరానికి అందాలంటే లివర్ విడుదల చేసే కొన్ని ఎంజైములు ప్రదానం. లివర్ పనితీరు చిన్న సమస్య వాటిల్లినా పూర్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉండటంలో మనం తీసుకునే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది, ఎటువంటి ఆహారం తీసుకుంటే లివర్ పనితీరు బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

లివర్ బాగుంటునే ఆరోగ్యం బాగుంటుంది కనుక దీనిమీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలి, దీని కోసం మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. లివర్ ఆరోగ్యం బాగుండాలంటే ముందుగా మద్యపానాన్ని మానేయాలి, మద్యపానం క్రమక్రమంగా లివర్ పనితీరును దెబ్బతీస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ప్రతీరోజు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి, ఆహారంలో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉండేలా చూడాలి. అవకాడోస్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి, ఇవి లివర్ లివర్ ఆరోగ్యాన్ని కాపాడతాయి, అంతేకాకుండా అవకాడోస్ లో ఉండే మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు లివర్లోని చెడు కొవ్వుని బయటకి పంపించి లివర్ పనితీరును పెంపొందిస్తాయి. దీనితోపాటు, బ్లూ బెర్రీస్ మరియు బ్లాక్ బెర్రీస్ వీటిని కూడా ప్రతిరోజు తినాలి, వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం మూలాన లివర్ పై పడే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతయి.

ప్రతి రోజు టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్నవారు ఆ అలవాటును మానుకొని, వీటి స్థానంలో గ్రీన్ టీ, మరియు బ్లాక్ టీ వంటివాటిని తాగడం అలవాటు చేసుకోవాలి. గ్రీన్ టీ లోని కొన్ని సమ్మేళనాలు లివర్ ని డిటాక్స్ చెయ్యడంలో తోడ్పడతాయి. అలాగే ఆపిల్ కూడా లివర్ పనితీరు మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజు ఆపిల్ తినడం ద్వారా లివర్ లోని చెడు కొవ్వును శుభ్రం చేసి బయటకి పంపిస్తుంది.

లివర్ ఆరోగ్యాన్ని కాపాడే మరొక్క ఫలం బొప్పాయి. బొప్పయిలోని కొన్ని ప్రత్యేకమైన ఎంజైములు, మరియు విటమిన్లు లివర్ యొక్క పని భారాన్ని తగ్గించి ఒత్తిడిని తగ్గిస్తాయి. బొప్పాయితో పాటు సిట్రస్ ఫలాలు మరియు కివి లో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువుగా ఉండటం వలన ఇవి లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడతయి. ఈ విధంగా సమతుల్యమైన ఆహారాన్ని తినడం మూలాన లివర్ పనితీరు మెరుగుపడి ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించేందుకు వీలుంటుంది.

Share your comments

Subscribe Magazine