Health & Lifestyle

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం మంచిదేనా?

KJ Staff
KJ Staff

ప్రస్తుతం అందరి బిజి బిజి జీవితాల్లో, వంట చెయ్యడానికి, గ్యాస్ దగ్గర కొద్దీ సేపు కూడా నించొని పనిచెయ్యలేనివారు, కూడా ఉన్నారు. ఇటువంటి వారి జీవితాల్లో టెక్నాలజీ ముఖ్యమైన ప్రాభవం చూపుతుంది. కాలం మారేకొద్దీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు వచ్చి అన్నం వండటాన్ని మరింత సులభతరం చేసాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు మరియు విద్యార్థులకు ఈ ఎలెక్ట్రయి కూక్కర్స్ ఎంతో సహాయపడుతున్నాయి అని చెప్పవచ్చు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు అందుబాటులోకి రావడంతో, చాలా ఇళ్లలో అన్నం వండటానికి వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఎలక్ట్రిక్ కుక్కెర్లలో వండిన అన్నం తినడం ద్వారా కొన్ని సమస్యలు తలెత్తుతాయి వాటి గురించి ఇప్పుడు తెల్సుకుందాం.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో అన్నం వండితే, అన్నం ఉడికిన తరువాత దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. దీని వలన అన్నం ముద్దగా అవుతుందన్న భయం ఉండదు. ఇలా వండటం ద్వారా మధ్యలో వెళ్లి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. అన్నం వండటం సులభతరం అవుతుంది, అలాగే సమయం కూడా ఆదా అవుతుందన్న ఉద్దేశంతో చాలా మంది వీటిని వాడటానికి మొగ్గు చూపుతున్నారు. అయితే వీటిలో వండిన అన్నం తింటే అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు, ఎలక్ట్రిక్ కుక్కర్లు లో అల్యూమినియం పాత్రలను ఉపయోగిస్తారు. అల్యూమినియం పాత్రల్లో వండిన అన్నం ఎక్కువ కాలం తింటే కాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో వండిన అన్నాన్ని తరచూ తినడం వలన రోగనిరోధక శక్తీ దెబ్బతినడంతోపాటు, చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. పైగా, ఎలక్ట్రిక్ కుక్కర్లలోని అన్నం తినడం వల్ల గ్యాస్, అజీర్తి మరియు ఉదర సంబంధిత రోగాలు తలెత్తడానికి అవకాశం ఎక్కువుగా ఉంటుంది. దీనితోపాటు గుండెపోటు, నడుము నొప్పి, కీళ్ళవాతం, డయాబెటిస్ వంటి రోగాలు వచ్చే ప్రమాదముందని వైద్యులు సూచిస్తున్నారు.

ఎలక్ట్రిక్ కుక్కర్స్ లో వండిన అన్నం తింటే మన శరీరానికి లభించవలసిన పోషకాలు లభించవు, దీనితోపాటు నాన్-స్టిక్ పూత ఉన్న కుక్కర్స్ ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. రైస్ కుక్కర్లు ఎంచుకునే ముందు కాస్త జాగ్రత్త వహించాలి, నాసిరకం కుక్కర్లను కొనుగోలు చేస్తే ఒక్కోసారి ఫుడ్ పోయిషనింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పని సులభంగా అయిపోతుందని ఎలక్ట్రిక్ కుక్కర్స్ లో అన్నం వండుకొని తినడం మంచిది కాదు, పైగా దీని వలన నష్టాలే ఎక్కువ.

Share your comments

Subscribe Magazine