పిజ్జా పేరు తెలియనివారు ఎవరున్నారు చెప్పండి. సిటీల నుండి పల్లెటూర్ల వరకు పిజ్జా ప్రస్తావన వినిపిస్తుంది. దీనిని ఒక్కసారైనా తినాలని కొందరు ఆరాటపడితే, మరికొందరు దీనిని తింటూనే కాలంవెల్లదీస్తారు. పిజ్జా మన దేశపు ఆహరం కాకపోయినా, మన ఆహారంలో ఒక భాగం కావడానికి మాత్రం ఎక్కువ సమయం పట్టలేదు. పిజ్జాను అధికంగా తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది.
పిజ్జాకు ప్రపంచ వ్యాప్తంగా ఆధరణ ఉంది. పిజ్జా ఇటలీ వంటకం. పిండితో చేసిన బేస్ మీద, కొన్ని రకాల టాపింగ్స్, మరియు సాసులు వేసి, ఒవేన్ లో అధిక ఉష్ణోగ్రత వద్ద కలిస్తే పిజ్జా తయారవుతుంది. నిజానికి పిజ్జా మీద వేసే కూరగాయలు, మాంశం, మష్రూమ్, మొక్కజొన్న, ఇవన్నీ ఆరోగ్యకరమైనవైనా, దీనిని ఎక్కువగా తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలైతే ప్రమాదం ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పిజ్జా రుచికరమైన వంటకం. బాగుందికదాని ఒకేసారి మొత్తం తినేస్తే బరువు పెరిగిపోయే అవకాశం ఉంది. ఒక మీడియం సైజు పిజ్జా లో 200-300 కెలోరీలు ఉంటాయి. ఎక్కువసార్లు పిజ్జా తినడం వలన బరువు తొందరగా పెరుగుతారు, కాబట్టి పిజ్జాని చిన్న ముక్కలుగా తినడం మంచిది. పిజ్జా టాపింగ్స్ ఎంచుకునేటప్పుడు, లీన్ ప్రోటీన్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉండే టాపింగ్స్ ఎంచుకోండి. పిజ్జాలో ఎక్కువ కెలోరీలు ఉండటానికి సాసులు కూడా ఒక కారణం, కాబట్టి సాసులు తగ్గించడానికి ప్రయత్నించండి. పిజ్జా బేస్ మైదాతో చేసింది కాకుండా హోల్-వీట్ తో చేసింది ఎంచుకోవడం మంచిది.
పిజ్జా తయారీకి ఎక్కువగా పామ్ ఆయిల్ ఉపయోగిస్తారు. దీనివలన పిజ్జాలో సాధారణ సంతృప్త కొవ్వు మరియు సోడియం శాతం ఎక్కువుగా ఉంటుంది. సంతృప్త కొవ్వులు అధికంగా తినడం వలన చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, పైగా సోడియం కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది. చెడు కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసి, గుండె జబ్బుల భారిన పడే ప్రమాదం పెంచుతుంది. పిజ్జా లో సోడియం ఎక్కువగా ఉండటం వలన అధిక రక్తపోటు వస్తుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
పిజ్జా తయారీలో సుధీకరించిన పిండి లేదా మైదా అధికంగా వాడతారు. మైదా రక్తంలో చెక్కెరస్థాయి పెరిగేలా చేస్తుంది. తరచు పిజ్జా తినేవారిలో రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడమే కాకుండా, మధుమేహం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. పిజ్జా తయారీకి ఉపయోగించే మైదా త్వరగా జీర్ణం కాదు, దీంతో కడుపునొప్పి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. నాన్-వెజ్ పిజ్జా తయారీలో ప్రాసెస్ చెయ్యబడిన మాంశం ఎక్కువగా ఉపయోగిస్తారు , ఇటువంటి మాంశం ఎక్కువగా తినడం వలన కాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి, పిజ్జా ను తగినంత తక్కువ మొత్తంలో తినడానికి ప్రయత్నించాలి.
Share your comments