వర్షాకాలం, వర్షాలతో పాటు, దగ్గు మరియు జలుబు వంటి ఇన్ఫెక్షన్లను కూడా మోసుకువస్తుంది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గడం, మరియు వాతావరణంలో తేమ పెరిగిపోవడంతో ఆరోగ్య సమస్యలు ఎక్కువుగా ఉంటాయి, వర్షాకాలం తరువాత వచ్చే శీతాకాలంలో కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువగ బాధించేది జలుబు, దీని తీవ్రత ఎక్కువుగా ఉంటే దగ్గు సమస్య కూడా మొదలవుతుంది.
ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు రావడం వలన, ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. ఆరోగ్య అలవాట్లలో మార్పులు మరియు కొత్త ప్రదేశాల్లో నీరు తాగడం వలన ఈ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ ఆరోగ్య సమస్యలు ఎక్కువుగా ఉంటాయి, ఎందుకంటే వీరిలో వ్యాధినిరోధక శక్తీ తక్కువగా ఉండటం, మరియు మట్టిలో ఆడుకోవడం వలన వీరిలో ఈ లక్షణాలు ఎక్కువుగా కనిపిస్తాయి. వర్షాకాలంలో రోగనిరోధక శక్తీ కాస్త తగ్గడం మూలాన పెద్దవారిలో కూడా జలుబు మరియు దగ్గు వంటి సమస్యలు అధికంగా ఉంటాయి, ఈ వ్యాధులు క్రమంగా, ఫ్లూ మరియు జ్వరంగా మారవచ్చు, కాబట్టి ఈ ఇన్ఫెక్షన్లను తేలికగా తీసుకోకూడదు.
అయితే ఈ రోగాలకు మందులతోనే కాకుండా కొన్ని వంటింటి చిట్కాల ద్వారా కూడా నయం చేసుకోవచ్చు. మనం వంటింట్లో సహజంగా వాడే అల్లం, యాలకలు, ఇలాచీ వంటి వాటిని కషాయంలాగా చేసుకొని తాగితే క్షణాల్లో ఈ రోగాలు మాయమైపోతాయి. వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం యాలుకల టీ,
ఆయుర్వేదంలో అల్లాన్ని అద్భుతమైన ఔషధంగా పరిగణిస్తారు. అల్లం మరియు యాలుకలు అందరి కిచెన్లో సాధారణంగా లభించేవే. అల్లం మరియు యాలుకలను టీ లాగ తయారుచేసుకొని చేసుకొని తాగితే జలుబు, ఫ్లూ వంటి లక్షణాలకు వెంటనే ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పితో బాధపడేవారు, అల్లంతో టీ చేసుకొని తాగడం వలన గొంతు నొప్పి తగ్గుతుంది.
అల్లం, దాల్చిన చెక్క, నిమ్మ ఆకు టీ,
దాల్చిన చెక్క, అల్లం, మరియు నిమ్మ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి, ఈ ఇన్ఫెక్షన్ కలిగించే కారకాలను నిర్ములించి, రోగుల భారిన పడకుండా కాపాడతాయి. వీటితో చేసిన కాషాయం తాగడం ద్వారా జలుబు, దగ్గు, జ్వరం, వంటి వ్యాధులు తగ్గడానికి వీలుంటుంది.
Share your comments