ప్రాచీన కాలం నుంచి మన భారతదేశంలో ప్రకృతిని దేవతగా ఆరాధించి పూజించడం మన భారతీయ సంస్కృతిలో భాగమై కొనసాగుతోంది.అందులో ముఖ్యంగా వేప చెట్టుకు ప్రముఖ స్థానం ఇవ్వబడింది. వేప చెట్టు భారతీయ ఆయుర్వేద వైద్యంలో ఎన్నో మొండి వ్యాధులకు పరిష్కారం చూపుతోంది.వేప చెట్టు ఆకుల్లోనే కాకుండా వేర్లు,బెరడులో కూడా ఎన్నో ఔషధ గుణాలతో పాటు మన శరీరంలో వ్యాధి కారకాలను నశింపజేసి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.ఎంతో ప్రాముఖ్యత కలిగిన వేప ఆకుల వలన కలిగే ప్రయోజనాలెంటో ఇప్పుడు చూద్దాం.
ప్రతిరోజు వేప చెట్టు ఆకులను రసంగా చేసి సేవించడం వల్ల మన శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు వేపాకు రసం ప్రతి రోజు సేవించడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.వేప కొమ్మతో పళ్లను శుభ్రం చేసుకోవడం కొంత మంది గ్రామీణులకు అలవాటే ఇలా చేయడం వల్ల నోటి పూత, నోటి దుర్వాసన,చిగుళ్ల సమస్య తగ్గుతుంది.
వేప ఆకులో ఉన్న ఔషధ గుణాలు ఎన్నో రకాల చర్మ సమస్యలను నయం చేస్తుంది. చర్మం పై సాధారణంగా వచ్చే మొటిమలు, గజ్జి, తామర వంటి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ వేప ఆకులను తినొచ్చు లేదా పేస్టులాగా చేసి చర్మం పై రాయడం వల్ల సమస్య తగ్గుతుంది. అలాగే జుట్టు రాలడం, చుండ్రు సమస్య కూడా నయం అవుతుంది. కిడ్నీ సమస్యతో బాధపడేవారు వేప ఆకులను ఆరబెట్టి వాటిని పొడిగా మార్చి ప్రతిరోజూ గోరు వెచ్చని నీటితో కలిపి రెండు మూడు గ్రాములు సేవిస్తే కిడ్నీలో రాళ్లు కరగడంతో పాటు అనేక కిడ్నీ సమస్యలు తొలుగుతాయి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే మీ దగ్గరలోని వైద్యున్నీ సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం ఉత్తమం.
Share your comments