Health & Lifestyle

కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?

KJ Staff
KJ Staff

ఆహారపు అలవాట్లు మారుతున్నందున శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువుగా ఉండటం ప్రస్తుతం అందరిని బాధిస్తున్న సమస్య, కొలెస్ట్రాల్ పెరగడం మూలాన గుండె సంభందిత వ్యాధులు కూడా ఎక్కువయ్యాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తినడం మరియు అనేక ఇతర కారణాల వలన కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి ఆస్కారం ఉంటుంది.

శరీరంలో హార్మోన్ల మార్పుల మరియు బరువు పెరగడం వలన కూడా కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి అవకాశం ఉంటుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను ఎల్డిఎల్ యూనిట్స్ తో కొలుస్తారు, ఎల్డిఎల్ స్థాయి 160 కన్నా ఎక్కువ ఉంటే ప్రమాదకరమైనదిగా భావిస్తారు, అదే 100 కంటే తక్కువ ఉంటే సాధారణ స్థాయి లాగ పరిగణిస్తారు. అదే విధంగా మంచి కొలెస్ట్రాల్ స్థాయిని హెచ్డిఎల్ యూనిట్స్ తో కొలుస్తారు, దీని ప్రకారం మంచి కొలెస్ట్రాల్ 60% కంటే ఎక్కువ ఉంటె సురక్షితమైనదిగా, 40% కంటే తక్కువ ఉంటె ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు.

కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు:

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటానికి కొన్ని ఆహారపదార్ధాలకు దూరంగా ఉండాలి, ఎక్కువ నూనెతో చేసిన ఆహారం, ఫ్రైడ్ ఐటమ్స్, వంటివి తినకూడదు. అయితే కొలెస్ట్రాల్ పెరగడానికి కేవలం ఆహారం మాత్రమే కారణం కాదు. హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్, మొదలైన కారణాల వలన కూడా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. అధికంగా ఒత్తిడికి గురయ్యేవారిలో కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్లు కొన్ని అధ్యనాల్లో గుర్తించారు, దీనితోపాటు మిఠాయిలు ఎక్కువుగా తినేవారిలో కూడా కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అధికంగా ప్రాసెస్ చేసి ఆహారం ఎక్కువుగా తినడం వలన కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవడం ఎలా?

కొలెస్ట్రాల్ అదుపు చెయ్యడానికి ఆహార నియమాల్లో ఎన్నో మార్పులు చెయ్యవలసి ఉంటుంది. ముందుగా ఫైబర్ ఎక్కువుగా ఉండే ఆహారమైన పండ్లు మరియు కూరగాయలు ఎక్కువుగా తినాలి. ఆహారంలో ఫైబర్ చెక్కెర స్థాయిని నియంటించడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ శాతాని కూడా తగ్గిస్తుంది. వీటితోపాటు అవకాడోస్, చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్, చేపలు వంటి ఆహారపదార్ధాల్ని ఎక్కువుగా తినాలి, వీటిలో మోనోసాతురేటెడ్, పోలీసాచురేటెడ్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి మరియు మెదడుకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. కొలెస్ట్రాల్ పెరగడానికి స్ట్రెస్ కూడా ఒక కారణం కాబట్టి, మనసును మరియు మెదడును ప్రశాంతంగా ఉంచుకోవాలి, యోగ మరియు మెడిటేషన్ చెయ్యడం ద్వారా స్ట్రెస్ నియంత్రించవచ్చు. మంచి జీవైనశైలిని అలవరచుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ ని సమగ్రవంతంగా నివారించవచ్చు.

Share your comments

Subscribe Magazine