సాధారణంగా మనం చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం.ముఖ్యంగా చర్మం పై ఉన్న మచ్చలను మొటిమలను తగ్గించుకోవడం కోసం వివిధ రకాల నూనెలను ఉపయోగించడం చేస్తుంటారు.అయితే చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం అవిసె గింజల నుంచి తయారు చేసిన నూనెను ఉపయోగిస్తారని మీరు ఎప్పుడైనా విన్నారా.. అవిసె గింజలతో తయారు చేసినటువంటి నూనెను ఉపయోగించడం వల్ల మన చర్మసౌందర్యానికి ఎంతగానో పెంపొందించుకోవచ్చు. మరి అవిస గింజల నూనె ద్వారా కలిగే ఆరోగ్యం, చర్మ సౌందర్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా చాలా మంది దీర్ఘకాలిక చర్మవ్యాధులతో బాధపడుతుంటారు. అదే విధంగా చర్మం పై ఏర్పడిన దద్దుర్లు, దురదను తగ్గించడానికి అవిసె గింజల నూనె చక్కటి పరిష్కార మార్గమని చెప్పవచ్చు.అయితే మన చర్మంపై ఎక్కడైతే ఈ విధమైనటువంటి సమస్య ఉంటుందో ఆ ప్రాంతంలో రెండు చుక్కల నూనెవేసి రాయడం వల్ల ఆ సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ నూనె మన చర్మానికి తేమగా ఉంచి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.
కళ్ళ కింద ఏర్పడినటువంటి నల్ల వలయాలు తొలగించడానికి అవిసె గింజల నూనె ఎంతో ఉపయోగపడుతుంది. రెండు చుక్కల నూనెతో కళ్ళకింద నల్లటి వలయాల పై మర్దనా చేయడం ద్వారా మచ్చలు తొలగిపోతాయి. ఇప్పటికే మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఈ అవిసె గింజల నూనెను ఉపయోగిస్తున్నారు.ఈ నూనెను రెండు చుక్కలు గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల జీర్ణ క్రియ వ్యవస్థ ఎంతో మెరుగ్గా పని చేస్తుంది.
Share your comments