నిద్ర మనిషికి అవసరం మాత్రమే కాదు అంది ఒక భాగం. ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరంటే మంచం మీద వాలగానే నిద్రపోయేవారు. కానీ ఈ అదృష్టం అందరికి దక్కదు. కొంతమంది ఎంత అలసిపోయిన సరే నిద్రపట్టక తెగ ఇబ్బంది పడతారు. సరైన నిద్ర లేకుంటే శారీరిక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మాససిక ఒత్తిడి పెరగడం వలన పనిమీద దృష్టిపెట్టలేరు. కనుక ప్రతిరోజు తగినంత నిద్రపోవడం చాల అవసరం. అయితే పడుకున్న వెంటనే నిద్రపట్టడానికి ఈ చిట్కాలు పాటించి చుడండి.
ముందుగా నిద్రలేమి సమస్య రావడానికి ప్రధాన కారణం స్మార్ట్ఫోన్ వినియోగం. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. పడుకునే ముందు ఫోన్ చూసే అలవాటు ఉంటే వెంటనే ఈ లక్షణాన్ని మానుకోండి. స్ట్రెస్ రావడానికి అధిక స్మార్ట్ ఫోన్ వినియోగం ప్రధాన కారణం. అంతేకాకుండా ఫోన్ స్క్రీన్ మీద నుండి వచ్చే కాంతి కళ్ళకు చాలా హానికరం. కనుక నిద్రించడానికి కనీసం ఒక గంట ముందునుండైనా ఫోన్ వినియోగం తగ్గించి చూడండి, ఇలా చెయ్యడం ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే మార్పు గమనిస్తారు.
రాత్రి పడుకునేముందు టీ తాగండి. అదేంటి టీ తాగేది నిద్రను తరిమికొట్టడానికి, కానీ టీ తాగితే నిద్ర ఎలా పడుతుంది అన్న ఆలోచన మీకు వచ్చి ఉండవచ్చు. అయితే మనం రోజు తాగే సాధారణ టీ కాకుండా చమోమెలీ లేదా అశ్వగంధ టీ తాగండి. వీటిని ఆన్లైన్లో లేదా ఆయుర్వేదం షాపుల్లో కొనుగోలు చెయ్యచ్చు. పడుకునే ముందు ఈ టీ తాగడం వలన నిద్రకు అవసరమయ్యే హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిచేయ్యడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా బాగా ఒత్తిడి కలిగినప్పుడు ఉత్పత్తయ్యే కార్టిసాల్ హార్మోన్ ను తగ్గిస్తుంది. సరైన నిద్ర లేకపోవడానికి జీవనశైలి కూడా ఒక కారణం. శారీరికంగా ఫిట్ గా లేకపోయినా నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్ గా ఉండటం కోసం ఉదయాన్నే యోగ, ఎక్సర్సైజ్ చెయ్యడం వంటివి అలవరచుకోండి. వ్యాయామం వలన శరీరంలో హార్మోన్ల సమతుల్యత పెరుగుతుంది.
వీటితో పాటు ప్రశాంతమైన నిద్ర కోసం రాత్రి పడుకునేముందు, కొబ్బరి నూనెతో లేదా నువ్వుల నూనెతో అరికాళ్లకు మరియు మోకాళ్ళకు మసాజ్ చేసి చూడండి. దీని వలన రక్త ప్రసరణ బాగా జరిగి సుఖమైనా నిద్రపడుతుంది. ఈ విధంగా అన్ని చిట్కాలను పాటిస్తూ నిద్రలేమి సమస్యను దూరం చేసుకోండి అయితే నిద్రలేమి ఒక్కరోజులో పోయే సమస్య కాదు, పైన చెప్పినవన్నీ మీ జీవితంలో భాగం చేసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
Share your comments