చాల మంది ప్రతిదీ తొందరగా మర్చిపోతుంటారు, కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకోవాలన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఇబ్బంది పడుతుంతారు. జ్ఞాపక శక్తిలోపం అనేది వయసుతో పాటు పెరుగుతూవస్తోంది, కానీ చాల మందికి వయసుతో సంభంధం లేకుండా ఈ లోపం వస్తుంటుంది. ఇటువంటి వారు కొన్ని ఆహార పదార్ధాలు తినడం ద్వారా జ్ణాపకా శక్తిని పెంచుకోగలరు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జ్ఞాపక శక్తీ పెంపొందించడానికి శరీరంతో పాటు మెదడుకు పోషణ అందించే ఆహరం తీసుకోవడం మంచిది. ఈ పోషకాల ద్వారా మీదుకు సరైన రక్త ప్రసరణ జరిగి జ్ఞాపక శక్తీ పెంపొందించబడుతుంది. ఇలా మెదడుకు అవసరమయ్యే పోషకాలు అన్ని మెండుగా లభించే ఆహార పదార్ధాల్లో చేపలు ఒకటి. చేపల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ మెదడుకు పోషణను అందించడంలో సహాయపడతాయి. జ్ఞాపక శక్తీ పెంచుకోవాలనుకునేవారికి పాలు ఒక చక్కటి ఆహారం. పాలను బ్రెయిన్ బూస్టింగ్ డ్రింక్ గా పరిగణిస్తారు, పాలల్లో ఉండే పోషకాలు మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తాయి. మతిమరుపు ఎక్కువగా ఉన్నవారు బాదాం పాలు, వేరుశెనగ పప్పులను తీసుకోవడం మంచిది, వీటి ద్వారా లభించే పోషకాలు మెదడు పనితీరు పెంపొందించడంలో సహాయపడతాయి.
బ్రెయిన్ పనితీరు పెంచడానికి గుడ్లు కూడా ఎంతో సహాయపడతాయి. గుడ్లలో ఉండే కోలిన్, విటమిన్-బి పుష్కలంగా ఉండటం వలన మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ లో వాల్నాట్ మీదుకు పదునుపెట్టడంలో తోడ్పడతాయి. వాల్నట్స్ మెదడు ఆకృతిని కలిగి ఉంటాయి, వీటి ద్వారా లభించే ఫ్యాట్య్ ఆసిడ్స్ మెదడు ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడుతుంది. అంతేకాకుండా క్రమంతప్పకుండా ఆకుకూరలు మరియు కూరగాయలు తినడం వలన కూడా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఆకుకూరలు మరియు కూరగాయల్లో లభించే విటమిన్లు మరియు మినరల్స్ ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు బాటలు వేస్తాయి.
Share your comments