Health & Lifestyle

జుట్టు బాగా పెరగడానికి ఈ సూపర్ ఫుడ్ ట్రై చేసి చుడండి....

KJ Staff
KJ Staff

చాలామంది జుట్టు రాలిపోవడం, లేదంటే సరిగ్గా పెరగకపోవడంతో తెగ ఇబ్బంది పడుతుంటారు. తిరిగి మల్లి జుట్టు పెరగడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు, అయినాసరే కొన్ని సార్లు ఫలితం లభించకపోవచ్చు. జుట్టు బలంగా పెరగడంలో పోషకాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జట్టుకు అవసరమైన పోషకాలు లభించకుంటే, జుట్టు ఊడిపోవడం లేదంటే జీవరహితంగా తయారవ్వడం జరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా మరియు ఒత్తుగా పెరగడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు ఎదుగుదలలో దోహదపడే ఆహారంలో విటమిన్-ఈ ముఖ్యమైనది. ఈ విటమిన్ చాలా రకాల ఆహారపదార్ధాల్లో లభిస్తుంది, వీటిని రోజు తినడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్-ఈ దొరుకుతుంది. విటమిన్-ఈ పుష్కలంగా ఉండే ఆహారంలో బాదంపప్పు ఒకటి. బాదాం జుట్టు ఎదుగుదలలో ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు బాదంపప్పులు తినడం అలవాటు చేసుకోవాలి.

దీనితోపాటు ప్రొద్దుతిరుగుడు పువ్వు విత్తనాల్లో కూడా విటమిన్-ఈ సంవృద్ధిగా ఉంటుంది. అన్ని డ్రై ఫ్రూట్స్ షాపుల్లోనూ ప్రొద్దుతిరుగుడు విత్తనాలు సులభంగా లభిస్తాయి. వీటిని వెయ్యించి పొట్టు తీసి తినడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆలివ్ నూనెలో కూడా విటమిన్-ఈ పుష్కలంగా ఉంటుంది. జుట్టు బాగా పెరగాలి అని అనుకునేవారు వారి వంటల్లో ఆలివ్ నూనెను భాగం చేసుకోవడం మంచిది. అదేవిధంగా అవకాడోస్ లోని పోషకవిలువలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టు ఎదుగుదలలో ఎంతగానో దోహదపడతాయి.

జుట్టు బాగా పెరగాలని భావించేవారు బ్రోకలీని కూడా తీసుకుంటే మంచిది. బ్రోకలీలోను విటమిన్ ఈ తో పాటు జుట్టు పెరుగుదలకు కావలసిన పోషకాలు ఉంటాయి. జుట్టు పెరుగుదలకు దోహందం చేసే వాటిలో గుడ్లు చాలా ముఖ్యమైనవి. ప్రతిరోజు గుడ్లను తినడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. చిలకడ దుంపలలో విటమిన్ ఈతోపాటు జుట్టు పెరుగుదలకు దోహదం చేసే పోషకాలు ఉంటాయి కనుక చిలకడదుంపలను కూడా తినడం ఎంతో మంచి చేస్తుంది.

అంతేకాదు పెరుగు తినడం జుట్టు పెరుగుదలను పెంచుతుంది. సాల్మన్ ఫిష్ లో కూడా విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఈపుష్కలంగా ఉన్న చేపలను తింటే కూడా జుట్టు పెరుగుదల బాగుంటుంది. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పప్పులు ఉండేలా, ఆకుకూరలు ఉండేలా చూసుకుంటే వాటిలో ఉండే పోషకాలు మన జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. జుట్టు ఆరోగ్యంగా పెరగాలి అనుకునేవారు మార్కెట్లలో దొరికే నూనెలను నమ్ముకునే బదులు మంచి ఆహారాన్ని నమ్ముకుంటే మంచిది తప్పనిసరిగా మంచి ఫలితం ఉంటుంది.


Related Topics

#HairGrowth #Food #Health #Tips

Share your comments

Subscribe Magazine