పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. పాలలో ఉండే పోషకవిలువలు ప్రోటీన్లు, మరియు విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలులోని కాల్షియమ్ మరియు ఇతర పోషకాలు ఎముకు పుష్టికి మరియు కండరాల శక్తిని పెంచి శక్తిని ఇస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లకు పాలు చాలా అవసరం, పాలు పిల్లల మానసిక మరియు శారీరిక ఎదుగుదలలో తోడ్పడతాయి. ప్రతీ రోజు పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది, అయినప్పటికీ పాలతో పాటు కొన్ని రకాల ఆహారపదార్ధాలు ఎట్టిపరిస్థితిలోను తినకూడదు. కొన్ని రకాల ఆహారపదార్ధాల్ని పాలతో కలిపి తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కొన్ని రకాల ఆహారపదార్ధాలను పాలతో కలిపి తీసుకున్నపుడు, వీటి రెండిటి కలయిక దుష్ప్రభావాలు కలిగిస్తుందని చెబుతున్నారు. అయితే పాలతో కలిపి తీసుకోకూడని ఆహరం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పాలు మరియు పెరుగు ఎట్టిపరిస్థితిలోను కలిపి తీసుకోకూడదు. నిజానికి పాలనుండే పెరుగు వచ్చినప్పటికీ, రెండిటి లక్షణాల్లోను ఎంతో వ్యత్యసం ఉంటుంది. ఈ రెండిటిని కలిపి తీసుకున్నట్లైతే శరీరంలో ఎన్నో టాక్సిన్స్ వెలువడే అవకాశం. ఒకవేళ రెండిటిని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే, కనీసం ఒక గంట వ్యవధి వ్యత్యాసంలో రెండిటిని తీసుకోవాలి.
అదేవిధంగా పాలతో నిమ్మకాయ మరియు పుచ్చకాయను తినకూడదు. పాలు తాగే సమయంలో నిమ్మకాయ, ఉప్పు, బెల్లం వంటి వాటిని తినకూడదు. మరొక్కటి పుచ్చకాయ, ప్రస్తుతం చాలా మంది రోజ్ మిల్క్ విక్రయించే వ్యాపారాలు, దానిలో పుచ్చకాయ ముక్కలను వేసి విక్రయిస్తున్నారు. పాలతో పుచ్చకాయ తినడం చాలా ప్రమాదకరం. వీటిని కలిపి తీసుకోవడం వలన వాంతులు మరియు విరోచనాలు అవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. పాలు తాగిన వెంటనే మినప్పప్పు, పెసరపప్పు, శెనగపప్పు వంటి పప్పుదినుసులు తినకూడదు. పాలు తాగిన వెంటనే పప్పులు తినడం ద్వారా జీర్ణక్రియ మందగించడమే కాకుండా, ఇతర సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే పాలు తాగే రెండు గంటల ముందు మరియు తరువాత ముల్లంగిని అస్సలు తినకూడదు. ఇలా తినడం ద్వారా ముల్లంగిలోని కొన్ని రసాయనాలు పాలతో కలిసి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తేలా చేస్తాయి. అదేవిధంగా పాలతో కలిపి పుల్లని పెళ్ళైన, బత్తాయి, నారింజ, మొదలైన ఫలాలను తినకపోవడం మంచిది. పుల్లని పళ్లలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది పాలతో కలిస్తే, గ్యాస్, అజీర్తి, వంటి జీర్ణ సంభందిత సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఎక్కువుగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి రోజు పాలు తాగేవారు ఇటువంటి ఆహారం తీసుకోకూడదు.
Share your comments