సాధారణంగా చాలామంది చిన్నపాటి విషయానికి ఎంతో చిరాకు పడుతూ ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలామందికి ఎంతో మానసిక వేదనను అనుభవిస్తూ ఉంటారు. అయితే కేవలం పని ఒత్తిడి కారణంగా మాత్రమే కాకుండా,మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా మన మెదడు పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.ఎందుకంటే మన పొట్ట నుంచి మెదడుకు కొన్ని లక్షల నరాలు అనుసంధానమై ఉండటం వల్ల మనం తీసుకునే ఆహారం మెదడుపై ప్రభావం చూపి మెదడు పనితీరును నిర్ణయిస్తుంది. అందుకోసమే మనం తీసుకునే ఆహారం సమతుల ఆహారం అయితే శారీరకంగాను, మానసికంగాను మనల్ని ఎంతో ఫిట్ గా ఉంచుతుంది. మరి మానసికస్థితిని పెంపొందించుకోవాలంటే ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
అన్ని కాలాల్లో దొరికే పండ్లలో అరటి పండు ఒకటి. అరటి పండులో మనం తిన్నప్పుడు మన మెదడు అధిక శక్తిని గ్రహిస్తుంది. అందుకు గల కారణం అరటిపండులో ఉన్నటువంటి విటమిన్ బి6, అమైనో ఆమ్లం, ట్రిప్టోఫాన్ వంటి ఆమ్లాలు మన శరీరంలో శరీరంలో డోపామైన్, సెరోటోనిన్ వంటి మంచి హార్మోన్లను స్రవించడంలో దోహదపడతాయి ఈ క్రమంలోనే మన మెదడు పనితీరును చురుకుగా చేస్తుంది. అదేవిధంగా వాల్నట్, బాదం వేరుశెనగ గింజలలో కూడా అధిక మొత్తంలో ట్రిప్టోఫాన్ కలిగి ఉండటం వల్ల వీటిని తిన్నప్పుడు మనకు మానసిక ఒత్తిడి తగ్గి నూతన ఉత్సాహాన్ని కల్పిస్తుంది.
మిమ్మల్ని దోమలు బాగా వేదిస్తున్నాయా కారణం ఇదే !
పండ్లు మాత్రమే కాకుండా కూరగాయలు కూడా మన మూడును మారుస్తాయి. ఎక్కువగా బీన్స్, పప్పు ధాన్యాలను,శరీరంలో డోపామైన్, సెరోటోనిన్, నోర్-ఎపినెఫ్రిన్ స్థాయిలు పుష్కలంగా ఉండటం వల్ల మనలో మానసిక స్థితి పెంపొందుతుంది. ఇక పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉండటం వల్ల ఇది ఒత్తిడి కలిగించేటువంటి కార్టిసాల్ అనే హార్మోన్ ను తగ్గించడానికి ఇది దోహదపడుతుంది. ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను తరచూ తీసుకోవడం వల్ల మన మానసిక స్థితిని పెంపొందించుకోవచ్చు.
Share your comments