Health & Lifestyle

థైరాయిడ్ సమస్యను తగ్గించే ఆహార పదార్దాలు

Srikanth B
Srikanth B

మారుతున్న కాలంలో ఆహారం జీవన శైలి కారణముగా అనేక వ్యాధుల బారిన పడే , మారుతున్న ఆహారం జీవంశాలి కారణంగా శరీరం హార్మోన్ల లో హెచ్చు తగ్గులు వచ్చి అనేక సమస్యలు వేధిస్తాయి అందులో అతి ముఖ్యమైనది థైరాయిడ్ సమస్య హార్మన్ల లోపం వల్ల కలిగే ఈ సమస్యను కొన్ని ఆహారాలు నిర్ములించడానికి దోహదం చేస్తాయి అవేంటో ఇక్కడ చూద్దాం !

థైరాయిడ్‎ను తగ్గించే ఆహార పదార్థాలు

థైరాయిడ్ మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావంచూపుతుంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం థైరాయిడ్ తీవ్రతను తగ్గించుకోవాలంటే ఐదు రకాల ఆహారాలు బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. ఉసిరికాయలో విటమిన్ సి నారింజలో కంటే 8రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాకుండా వ్యాధులతో పోరాటం చేసే సామార్థ్యంకూడా పెరుగుతుంది.

ఫంగల్ వ్యాధులకు కారణాలు ఏమిటి?

బ్రెజిల్ గింజలు

థైరాయిడ్ హార్మోన్ల జీవక్రియకు శరీరానికి అవసరమైన సూక్ష్మపోషకం సెలీనియం. టీ4, టీ3గా మార్చేందుకు సెలీనియం చాలా అవసరం. బ్రెజిల్ గింజల్లో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటుంది. రోజుకు మూడు బ్రెజిల్ గింజలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

వీటన్నింటితోపాటుగా చేపలు, సాల్మన్, ట్యూనా, రొయ్యలు మొదలైన వాటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతేకాదు ఇందులో సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ ను కంట్రోల్లో ఉంచుతాయి.

కొబ్బరి నూనె

కొబ్బరి, కొబ్బరినూనె థైరాయిడ్ ఉన్నవారికి ఔషదం లాంటిది. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకో స్పూన్ కొబ్బరి నూనె తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. దీంతో శరీరం విటమిన్లు, ఖనిజాలు గ్రహించడానికి సహాయపడుతుంది. అంతేకాదు థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను కూడా ప్రోత్సహిస్తుంది.

ఫంగల్ వ్యాధులకు కారణాలు ఏమిటి?

Related Topics

helath tips

Share your comments

Subscribe Magazine